Nari Shakti Puraskar : ఇంటర్నేషనల్ విమెన్స్ డే పురస్కరించుకుని ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలు(Nari Shakti Puraskar )ప్రదానం చేశారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన వారిని 14 అవార్డుల చొప్పున రెండేళ్లకు సంబంధించి 28 మందికి పురస్కారాలు అందచేశారు.
ఇదిలా ఉండగా మహిళా సంక్షేమం కోసం పాటు పడిన వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు గాను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని అందజేస్తోంది.
గత కొన్నేళ్ల నుంచి వీటిని ఇస్తూ వస్తోంది. కాగా ఈ నారీ శక్తి పురస్కారాలను అందుకున్న వారిలో అనితా గుప్తా, ఉషా బెన్ వాసవ, నసీరా అఖ్తర్ , నివృతి రాయ్ , సాయిలీ నంద కిశోర్ , జగదేవ్ బోరడే, నీనా గుప్తా , తదితరులు వీటిని అందుకున్న వారిలో ఉన్నారు.
ఈ పురస్కారల కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి మాట్లాడారు. మహిళలు లేక పోతే ఈ ప్రపంచం లేదన్నారు.
సమాజాభివృద్దిలో కీలకం కాక పోతే ఆ దేశం ఇబ్బందుల్లో ఉంటుందన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
Also Read : బైజూస్ కు ఆమె ఓ ఐకాన్