Jio World Centre : భారత దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజంగా ఇప్పటికే పేరుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కు. టెలికాం సెక్టార్ లో నే కాదు అన్ని రంగాలలో రిలయన్స్ తన హవా కొనసాగిస్తోంది.
ప్రపంచంలోనే ఇప్పుడు టాప్ కంపెనీగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్ గా దుమ్ము రేపుతోంది.
రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ కంపెనీలు నేల చూపులు చూస్తున్నాయి. ఓ వైపు ముకేశ్ అంబానీ ఇంకో వైపు అదానీలు ఇద్దరూ భారతీయ మార్కెట్ ను శాసిస్తున్నారు.
టాటా గ్రూప్ మాత్రం సైలంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతానికి రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది.
తాజాగా పారిశ్రామిక దిగ్గజం ముంబైలో జియో వరల్డ్ సెంటర్ (ప్రపంచ కేంద్రం) ను (Jio World Centre)ప్రారంభించింది. దీని విస్తీర్ణం దాదాపు 18.5 ఎకరాలు ఉంటుంది.
ఈ ప్రపంచ కేంద్రంలో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెయిన్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది.
5జీ నెట్ వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్ లో 1.61 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్ తో పాటు 1.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి.
అంతే కాకుండా ఈ ఏడాది, వచ్చే ఏడాది దశల వారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు జియో వరల్డ్ సెంటర్ ప్రతిరూపంగా ఉంటుందన్నారు ఆర్ఐఎల్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ.
Also Read : ఫేస్ బుక్ పై రష్యా ఆంక్షలు