Ayodhya: అయోధ్య గెస్ట్‌హౌస్‌లో మహిళ అశ్లీల వీడియోలు చిత్రీకరించిన నిందితుడి అరెస్టు

అయోధ్య గెస్ట్‌హౌస్‌లో మహిళ అశ్లీల వీడియోలు చిత్రీకరించిన నిందితుడి అరెస్టు

Ayodhya : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. అయోధ్య రాముని దర్శనానికి వచ్చి గెస్ట్‌హౌస్‌లో దిగిన ఓ మహిళ బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించాడు. అయితే ఎవరో తనను వీడియో తీస్తున్నారని గమనించిన ఆ మహిళ ఒక్కసారిగా కేకలు వేయడంతో… ఆమె బంధువులు, గెస్ట్ హౌస్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తి ఫోన్ లో వందలాది మంది మహిళల వీడియోలు చూసి పోలీసులు ఖంగు తిన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Ayodhya Guest House…

వారణాసికి చెందిన 30 ఏళ్ల మహిళ రామ మందిరాన్ని సందర్శించేందుకు మరికొందరితో కలిసి అయోధ్యకు(Ayodhya) వచ్చారు. వారంతా అయోధ్యలోని(Ayodhya) రామాలయం గేట్‌ నంబర్‌-3 దగ్గరలో రాజా గెస్ట్‌ హౌస్‌లో రూమ్స్ తీసుకున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. ఇంతలో ఎవరో తనను వీడియో తీస్తున్న విషయాన్ని ఆమె గమనించి కేకలు వేసింది. దీనితో వెంటనే అక్కడ ఉన్న యాత్రికులతో పాటు గెస్ట్‌హౌస్‌ అధికారులు అక్కడికి చేరుకొని నిందితుడు సౌరభ్ తివారీని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడు యూపీలోని బహ్రైచ్‌కు చెందినవాడుగా అధికారులు గుర్తించారు. సౌరభ్ ఆ అతిథిగృహంలోనే పని చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను పరిశీలించగా… అందులో చాలామంది మహిళల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ… నేనుస్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. బాత్‌రూమ్‌లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌ తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌ లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని ఆమె తెలిపారు.

Also Read : Nainar Nagendran: తమిళనాడు బీజేపీ చీఫ్ గా నయినార్‌ నాగేంద్రన్‌

Leave A Reply

Your Email Id will not be published!