Ayodhya Updates : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు సెలవు ప్రకటించిన కేంద్రం

ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ

Ayodhya Updates : హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్యలో రామమందిరం(Ayodhya) తెరుచుకోనుంది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా తీవ్రఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Ayodhya Updates From Centre

జనవరి 22న, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ప్రకటించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యే వరకు కార్యాలయం పనిచేయదు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోస్టాఫీసులు, బ్యాంకులు, అనేక కేంద్ర సంస్థలకు కూడా సెలవు పాటించనున్నట్లు తెలిపారు.

అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు పూర్తి రోజుల పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలు మూసివేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడేస్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రాణ ప్రతిష్ఠా రోజున మద్యం షాపులను కూడా బంద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులను 21వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే 22వ తేదీ ప్రభుత్వ సెలవుదినా అన్నది ఇంకా తెలియరాలేదు. తెలంగాణ రాష్ట్రంలో 22వ తేదీ ప్రభుత్వ సెలవుదినా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : Kodi Katti Case: నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి !

Leave A Reply

Your Email Id will not be published!