Ayutha Chandi Yagam : భక్తుల నివేదన లక్ష కుంకుమార్చన
శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
Ayutha Chandi Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతోంది. లోక కళ్యాణం కోసం , యావత్ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ చండీ అతిరుద్ర యాగం నిర్వహిస్తున్నారు.
Ayutha Chandi Yagam in Jadcherla
అంగరంగ వైభవంగా ఆగస్టు 14 నుండి ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ఈనెట 27 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ సామూహిక విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 7 గంటలకు గోపూజ, 7.30 గంటలకు తులసి పూజ, 9 గంటలకు సహస్ర లింగార్చన, రుద్రాభిషేకం, 10 గంటలకు కోటి కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు విష్ణు సహస్ర నామం, లలిత సహస్ర నామం, సౌందర్య లహరి పారాయణం, 2 గంటలకు హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం, భజనలు , రాత్రి 7 గంటలకు రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, 8.30 గంటలకు తీర్థ ప్రసాదం భక్తులకు అందజేస్తున్నారు.
స్వామి వారి ఆధ్వర్యంలో చండీ సహిత నవ దుర్గ హోమాలు , సామూహిక లక్ష్మీ వ్రతం చేపట్టారు. వరలక్ష్మి అమ్మ వారికి విశేష చక్ర అర్చన, పంచామృత అభిషేకం , లక్ష గాజుల అర్చన, లక్ష కుంకుమ అర్చన నిర్వహించారు.
ఇవాళ ఉదయం 7 గంటలకు శ్రీ సుదర్శన పూర్వక మహా మృత్యుంజయ, వరలక్ష్మీ సమేత మహా నారాయణ హోమాలు, సీతారాములకు విశేష అభిషేకాలు చేపట్టారు.
Also Read : Liquor Shop Licence : రూ. 100 కోట్లు 110 వైన్ షాప్స్