Jairam Ramesh : ఆజాద్ ఆరోప‌ణ‌లు అవాస్త‌వం – జైరాం

రాహుల్ గాంధీని టార్గెట్ చేయ‌డంపై ఫైర్

Jairam Ramesh :  కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం న‌బీ ఆజాద్ ఉన్న‌ట్టుండి శుక్ర‌వారం పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రాథ‌మిక స‌భ్య‌త్వంతో పాటు అన్ని ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేశారు.

పార్టీలో ప్రజాస్వామ్యం క‌నురుగైంద‌ని ప్ర‌ధానంగా రాహుల్ గాంధీ ఆధీనంలోకి పార్టీ వెళ్లాక స‌ర్వ‌నాశ‌న‌మైంద‌ని ఆరోపించారు. సోనియా గాంధీ కేవ‌లం నామ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

గులాం న‌బీ ఆజాద్(Gulam Nabi Azad) సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖ‌లో ప్ర‌స్తావించిన అంశాలు, విష‌యాలు, చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌న్నారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ్ జై రాం ర‌మేష్‌.

శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లుగా కొట్టి పారేశారు. పార్టీలో ఎవ‌రూ ఎవ‌రినీ ప‌క్క‌న పెట్ట‌లేద‌న్నారు. లేఖ‌లో ప్ర‌ధానంగా పేర్కొన్న అంశాలు వాస్త‌వంగా లేవ‌న్నారు.

ఇలాంటి చౌక‌బారు విమ‌ర్శ‌లు చేయ‌డం గులాం న‌బీ ఆజాద్ కు మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఏదైనా వాస్త‌వం ఉంటే చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చుతుంద‌ని పేర్కొన్నారు.

సీనియ‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు. పార్టీ ప‌రంగా ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు. పార్టీ మీకు త‌గిన గుర్తింపు ఇచ్చింద‌ని , కానీ క‌ష్ట స‌మ‌యంలో పార్టీని విడిచి పెట్టి వెళ్ల‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రైన‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు జైరాం ర‌మేష్‌(Jairam Ramesh). ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆజాద్ రాజీనామా క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : గులాం న‌బీ ఆజాద్ కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!