Azharuddin Comment : ‘అజ్జూ’ అంతరంగంలో ఏముంది
పడి లేచిన కెరటం ప్రస్థానం
Azharuddin Comment : మహ్మద్ అజహదరుద్దీన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. మణికట్టు మాంత్రికుడు. ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ క్రికెటర్. భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడు. అంతకు మించి ఈ అద్భుత, అరుదైన ఆటగాడి కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి.
అంతకు మించిన ఒడిదుడుకులు ఉన్నాయి. వీటిని పక్కన పెడితే అసలు అజ్జూ భాయ్ ఎందుకు ఎప్పుడూ వార్తల్లో ఉంటాడనేది ఇప్పటికీ తెలియని అంశం. ఇటీవల మరోసారి అజహరుద్దీన్ హాట్ టాపిక్ గా మారాడు. ఎందుకంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ టీం మొత్తం ఏ భారతీయ క్రికెటర్ నైనా గేలి చేస్తుంది కానీ అజహరుద్దీన్ వరకు వచ్చేసరికి మాత్రం క్రికెటర్లంతా గౌరవ భావంతో ఉంటారని చెప్పాడు. దానిని క్రికెట్ లోకం తప్పుగా అర్థం చేసుకుంది.
స్లెడ్జింగ్ అనేది సర్వ సాధారణమని , ప్రధానంగా పాకిస్తాన్ , ఇండియా జట్ల మధ్య ఇది ఎక్కువగా జరుగతుందని కానీ తాము అజ్జూ(Azharuddin) మాత్రం తమకు పెద్దన్న అని చెప్పాడు. ప్రస్తుతం పొలిటిషియన్ గా ఉన్నాడు .
కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడు. ఒక రకంగా ఆ పార్టీకి ఆయన అస్సెట్ అని చెప్పక తప్పదు. ఇది పక్కన పెడితే..అజ్జూ మనం అనుకునేంత అమాయకుడా లేక అసాధ్యమైన వ్యక్తినా..అంటే చెప్పలేం.
1963లో పుట్టిన ఈ మాజీ క్రికెటర్ కు ఆట పట్ల మంచి పట్టుంది. అంతకంటే ఎక్కువగా అవగాహన ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మణికట్టు మాంత్రికుడికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. అదే సమయంలో మరకలు కూడా ఉన్నాయి.
ఫిక్సింగ్ లో జీవిత కాలం నిషేధం. నౌరీన్ తో విడాకులు, సంగీతా తో విడి పోవడం, రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయాడు. అన్నింటినీ చూశాడు. ఆయనపై సినిమాలు కూడా వచ్చాయి.
ఏక్తా కపూర్ అయితే ఏకంగా అజహరుద్దీన్(Azharuddin) తో డాక్యుమెంటరీ తీసింది. తానే అభిమానిగా మారి పోయింది. దగ్గరుండి చూస్తే కానీ అజ్జూ భాయ్ గురించి చెప్పలేమని పేర్కొంది ఒకానొక సమయంలో. అజహరుద్దీన్ బాధితుడు..మరో వైపు విజేత కూడా.
అద్భుతమైన జీవితాన్ని గడిపాడు..కానీ చిత్రమైనదిగా ఉంటుంది. మానసికంగా బలవంతుడు. ఒక రకంగా చెప్పాలంటే మహ్మద్ అజహరుద్దీన్ మైదానంలో అయినా బయట అయినా కెప్టెన్ గానే ఉన్నాడు.
99 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ప్రజలు అతడిని కిందకు నెట్టారు..కానీ అజ్జూ లేచి నిలబడ్డాడు. 58 ఏళ్లలో సైతం ఇంకా ఫిట్ గా ఉన్నాడు. కానీ అతడి అంతరంగం మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసు కోవాలన్న ఉత్సుకత కలుగుతుంది..ఇది కేవలం అజహరుద్దీన్ విషయంలో మాత్రమే ఎందుకనేది. ఆట తీరు కళాత్మకంగా ఉంటుంది. మొదటి నుంచి ఏది ఎప్పుడు జరుగాలో అలా జరుగుతుందని నమ్ముతూ వచ్చాడు..
ఇంకా అదే ధ్యాసలోనే ఉన్నాడు. దేని పట్ల వ్యతిరేకత ఉండదు..ఎలప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటానని స్పష్టం చేస్తూ వచ్చాడు మహ్మద్ అజహరుద్దీన్(Azharuddin). నా కాలర్ నన్ను అమితంగా ఇష్ట పడేలా…లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించి పెట్టిందంటాడు.
నా వినయమే నా బలం అని ..అదే నన్ను గట్టెక్కిస్తుందని చెబుతాడు. ఇప్పటికీ జనం నన్ను ఆడమని అడుగుతారు..ఫిట్ నెస్. బిగ్ బి అమితాబ్ బచ్చన్
అంటే వల్లమాలిన అభిమానం అజ్జూ భాయ్ కి.
నేను ఇలా ఉండడానికి కారణం మా తామ నవాజుద్దీన్. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతాడు. నేను ఆడాను..నా వద్ద కూడా ఎందరో ఆడారు.
కానీ కపిల్ దేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటాడు మాజీ క్రికెటర్. ఆయన కింద నేను ఆడాను..నా కింద ఆయన ఆడారు. ఇద్దరం ఒకరికొకరం ఇచ్చుకోగలం..పుచ్చుకోగలం.
క్రికెట్ కెరీర్ లో మరిచి పోలేని వ్యక్తులు ఎందరో ఉన్నారు..వారిలో నా పేరెంట్స్ .. రాజ్ సింగ్ దుర్గార్పూర్..కూడా.. అవును..అజ్జూ భాయ్(Azharuddin) అంతరంగంలో ఇంకా తెలియనివి చాలానే ఉన్నాయి.
Also Read : ఘన విజయం షఫాలీ భావోద్వేగం