B Tech Ravi : కడప వైఎస్ అవినాష్ రెడ్డి పై భగ్గుమన్న బీటెక్ రవి
అవినాష్ రెడ్డి వల్లే.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కుటుంబం దూరమైందన్నారు...
B Tech Ravi : పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆదివారం పులివెందుల్లో ఆయన స్పందించారు. వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్వోలను నిర్బంధించి ఎన్నికలు జరుపుకోన్నామని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారన్నారు. మరి ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే వేముల పోలీస్ స్టేషన్‌కు కాకుండా.. ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉందని సందేహం వ్యక్తం చేశారు.
B Tech Ravi Slams…
పులివెందులలోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకుని.. ఈ ఎన్నికలను బాయికాట్ చేశారన్నారు. గతంలో వైసీపీ పరిపాలనలో అన్ని ఏకగ్రీవం చేసుకున్నారని గుర్తు చేశారు. అద్దంలో తన ముఖం చూసుకొంటే.. బీటెక్ రవి చేతిలోనే వైయస్ కుటుంబం ఓడి పోయిందని గుర్తుపెట్టు కోవాలన్నారు. అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్‌కు చురకలంటించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. తన సోదరుడు, ఎంపీ అవినాశ్ రెడ్డిని తిడితే.. ఆ ప్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అవినాష్ రెడ్డి వల్లే.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కుటుంబం దూరమైందన్నారు. ఆ తర్వాత తల్లి,చెల్లి సైతం దూరమయ్యారని ప్రజలు చర్చించుకొంటున్నారన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే గత ఐదు సంవత్సరాలు రైతులకు డ్రిప్ ఇవ్వకుండా వేధించారని వైఎస్ అవినాష్ రెడ్డిపై మండిపడ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని సాగునీటి సంఘాలకు ఇటీవల ఎన్నికల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బిటెక్ రవి(B Tech Ravi) శనివారం స్పందించారు. 1978 నుంచి నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పేకలించిన ఘనత టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చెందుతుందన్నారు. దీంతో పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందని.. భారత రాజ్యాంగం మాత్రమే నిలిచి ఉందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా బిటెక్ రవి సోదాహరణగా వివరించారు. ఆ క్రమంలో తమ పార్టీ వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తమ అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వేశారన్నారు. కానీ ప్రస్తుతం జరిగిన సాగునీటి ఎన్నికల నేపథ్యంలో మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి ఎమ్మార్వో కార్యాలయాల దరిదాపులకు కూడా రాలేదన్నారు. అస్సలు సిస్సలు దద్దమ్మలు మిరే మేము కాదని వైసీపీ నేతలను బిటెక్ రవి ఎద్దేవా చేసిన విషయం విధితమే.
Also Read : Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ స్థానాల 4వ జాబితా విడుదల చేసిన ఆప్ సర్కార్