Babar Azam : పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ మరోసారి సత్తా చాటాడు. రెండు రికార్డులు నమోదు చేశాడు. స్వదేశంలో కరాచీ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో అత్యధిక స్కోర్ సాధించాడు.
కెప్టెన్ గా ఇది ఓ రికార్డ్. ఏకంగా బాబర్ ఆజమ్ 196 పరుగులు చేసి విస్తు పోయేలా చేశాడు. చివరి ఇన్నింగ్స్ లో నాథన్ లియోన్ చేతిలో అవుట్ అయ్యాడు. మొత్తం 425 బంతులు ఎదుర్కొని ఈ రన్స్ చేశాడు.
పాకిస్తాన్ తరపున ఏ ప్లేయర్ ఈ రికార్డు బ్రేక్ చేయలేదు. రెండో టెస్టు లో ఐదో రోజు ఈ ఫీట్ సాధించాడు బాబర్(Babar Azam). గతంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ యూనిస్ ఖాన్ ను దాటి ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాబు బాబర్ ఆజమ్.
2015లో శ్రీలంక జట్టుపై యూనిస్ ఖాన్ 171 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2007లో కోల్ కతాలో భారత జట్టుపై 107 పరుగులతో యూనిస్ ఖాన్ పై నమోదైన రికార్డును చెరిపేశాడు బాబర్ ఆజమ్.
నాలుగో ఇన్నింగ్స్ లో 400 కంటే ఎక్కువ బాల్స్ ఆడిన ప్లేయర్ కూడా కెప్టెన్ కావడం గమనార్హం. డబుల్ సెంచరీ చేసేందుకు కేవలం నాలుగు పరుగుల దూరంలో వెనుదిరిగాడు బాబర్ ఆజమ్.
160 వ ఓవర్ లో నాథన్ వేసిన అద్భుతమైన బంతిని ఆడలేక పెవిలియన్ బాట పట్టాడు. ఇక 196 పరుగులలో ఆజమ్ 21 ఫోర్లు ఓ సిక్స్ ఉన్నాయి.
Also Read : రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ కేక