Babar Azam : సత్తా చాటుతాం భారత్ ను ఓడిస్తాం
పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్
Babar Azam : గత ఏడాది 2021లో యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది దాయాది పాకిస్తాన్ భారత జట్టును. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది.
భారత, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా మ్యాచ్ లు జరగడం లేదు. ఇరు దేశాలు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ఫైనల్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకున్నాయి.
ఆసిస్ కప్ ఎగరేసుకు పోయింది. తటస్ట వేదికల మీద మాత్రమే ఇరు జట్లు పోటీ పడే పరిస్థితి నెలకొంది. దీంతో యావత్ ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య అసలైన పోరు కొనసాగనుంది.
ఆసియా కప్ ఇదే యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. 28న టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. అంటే మూడు సార్లు తలపడనున్నాయి.
తమ కంటే తీవ్రమైన ఒత్తిడిలో భారత్ ఉందన్నాడు ఆజమ్. తమ జట్టు భారత్ జట్టు కంటే బలంగా, స్థిరంగా ఉందన్నారు. సత్తా చాటుతామని కానీ అంతిమ విజయం తమదేనని స్పష్టం చేశాడు పాకిస్తాన్ కెప్టెన్.
అయితే తాము భారత్ గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నాడు.
Also Read : జోక్ గా మారిన క్రికెట్ జట్టు కెప్టెన్సీ