Babar Azam : టి20 వరల్డ్ కప్ మాదే – బాబర్ ఆజమ్
ఏ టీం వచ్చినా గెలిచేది మేమే
Babar Azam : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అనూహ్యంగా ఫైనల్ కు చేరింది దాయాది పాకిస్తాన్. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ గెలుపొందడంతో పాకిస్తాన్ సెమీస్ కు చేరింది. అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ ను పడుతూ లేస్తూ వచ్చిన పాకిస్తాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఫైనల్ కు చేరింది. ఇక గ్రూప్ -బిలో టాప్ లో ఉన్న భారత జట్టు ఇంగ్లండ్ తో తలపడుతోంది. ఇక యావత్ ప్రపంచమంతా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్ లో ఆడాలని కోరుకుంటున్నాయి.
ఒకవేళ ఈ ఇరు జట్లు ఫైనల్ లో తలపడితే కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల దాకా వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది అనధికారిక సమాచారం మాత్రమే.
ఏది ఏమైనా ఇరు జట్లు తలపడతాయా లేదా అన్నది పక్కన పెడితే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుని కోలుకోలేని రీతిలో కేన్ మామ టీంకు ఝలక్ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఫైనల్ లో తలపడేందుకు రెడీ అవుతోంది. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) తీవ్రంగా స్పందించారు.
భారత్ వచ్చినా లేదా ఇంగ్లండ్ జట్టు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఎవరు వచ్చినా తమ చేతిలో ఓడి పోవాల్సిందేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఢీకొనడం ఆ జట్లకు చేత కాదన్నారు. మొత్తంగా పెట్టే బేడా సర్దుకునేందుకు సిద్దమైన పాకిస్తాన్ ఇప్పుడు ఫైనల్ కు అడుగు పెట్టడం విచిత్రం కాక మరేంటి.
Also Read : భారత్ ఇంగ్లండ్ బిగ్ ఫైట్