Danish Kaneria : బాబార్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే ఛాన్స్
టి20 వరల్డ్ కప్ లో రాణించక పోతే కష్టం
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజం ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే టి20 వరల్డ్ కప్ లో రాణించక పోతే కష్టమన్నాడు.
లేకపోతే కెప్టెన్ గా ఉండడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు కనేరియా. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన టి20 ఆసియా కప్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు బాబర్ ఆజమ్(Babar Azam).
కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. కెప్టెన్ గా కూడా మంచి మార్కులు దక్కించు కోలేక పోయాడని కనేరియా పేర్కొన్నాడు.
తనతో పాటు జట్టును కూడా విజయ పథంలోకి నడిపిస్తేనే తన నాయకత్వ బాధ్యతల్ని కలిగి ఉంటాడని లేక పోతే కెప్టెన్ గా ఉండడం కష్టమన్నాడు.
ఎందుకంటే గతంలో గెలిచినా ఓడినా క్రికెట్ బోర్డులు కొంత కాలం పాటు నాయకులను మార్చకుండా ఉండేవని కానీ ఇప్పుడు సీన్ మారిందన్నాడు. గెలుపు ఓటములపై కెప్టెన్ షిప్ ఆధారపడి ఉందన్నాడు.
విజయాలను బేరీజు వేసుకుని ఆయా క్రికెట్ బోర్డులు కెప్టెన్లను కొనసాగించాలా లేక వద్దా అన్నది నిర్ణయిస్తున్నారని పేర్కొన్నాడు డానిష్ కనేరియా(Danish Kaneria). ఫైనల్ లో శ్రీలంక జట్టు చేతిలో ఓడి పోవడం బాబర్ ఆజమ్ కు పెద్ద దెబ్బ అని స్పష్టం చేశాడు.
ఒక వేళ గెలిచి ఉంటే కంటిన్యూ అయ్యే వాడని కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ జట్టు కంటే బాబర్ ఆజమ్ కు టి20 వరల్డ్ కప్ ఓ అగ్ని పరీక్ష కాక తప్పదన్నాడు కనేరియా.
Also Read : పాక్ కోసం ఇంగ్లండ్ క్రికెటర్ల ఔదార్యం