Imran Khan : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan). కరాచీ వేదికగా ఆసిస్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడటమే కాదు తన జట్టు ఓడి పోకుండా అడ్డుకున్నాడని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా 506 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆది లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బరిలోకి వచ్చిన బాబర్ ఆజమ్ 400కు పైగా బంతులు ఆడి 21 ఫోర్లు ఓ సిక్స్ తో 196 పరుగులు చేశాడు.
ఇప్పటికే అన్ని ఫార్మాట్ లలో అద్భుతమైన ఆట తీరుతో బాబర్ ఆజమ్ రాణిస్తున్నాడని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కితాబు ఇచ్చాడు. తాను బిజీగా ఉండడంతో మ్యాచ్ ను చూడలేక పోయానని తెలిపాడు.
1992లో ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. అద్భుతమైన ప్రతిభా పాటవాలతో ఆటతోనే కాదు కెప్టెన్ గా సత్తా చాటాడని వరల్డ్ క్రికెట్ లో ఆజమ్ టాప్ ప్లేయర్ గా కొనసాగుతుండడం తనకు సంతోషం కలిగించిందన్నాడు.
ఇప్పటికే దుబాయి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో సైతం పాకిస్తాన్ జట్టును విజయవంతంగా నడిపించడంలో ఆజమ్ సక్సెస్ అయ్యాడని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్.
కెప్టెన్ గా రెండు రోజుల పాటు క్రీజులో ఉంటూ అడ్డు గోడలా నిలబడ్డాడని, బలమైన ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించాడంటూ కితాబు ఇచ్చాడు పీఎం.
జట్టులోని మిగతా ప్లేయర్లు సైతం కనబర్చిన పోరాట పటిమ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు ఇమ్రాన్ ఖాన్.
Also Read : స్పిన్నర్లతో జట్టు బలంగా ఉంది