ICC ODI Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబ‌ర్..హ‌క్ టాప్

దిగ‌జారిన విరాట్ కోహ్లీ..రోహిత్ శ‌ర్మ ర్యాంకులు

ICC ODI Rankings : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టాప్ ర్యాంకింగ్స్ జాబితాను ప్ర‌క‌టించింది. ఇందులో పాకిస్తాన్ ఆట‌గాళ్లే మొద‌టి , రెండు స్థానాల్లో నిలిచారు. ఇక భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకులు ప‌డి పోయాయి. తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో కోహ్లీ 707 రేటింగ్ పాయింట్ల‌తో 8వ స్థానంలో నిలిచాడు.

ఇక మూడు పాయింట్లు త‌క్కువ 704 పాయింట్ల‌తో 9వ ప్లేస్ లో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ టూర్ లో రాణించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ర్యాంకు కాస్తా మెరుగు ప‌డింది. 27వ ర్యాంకులో ఉన్నాడు. ఇక మ‌రో ఓపెన‌ర్ బ్యాట‌ర్ శుభ్ మ‌న్ గిల్ 3 స్థానాలు దాటి 34వ ర్యాంకుతో స‌రి పెట్టుకున్నాడు.

ఇక మ‌రో వెట‌ర‌న్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ 15వ స్థానానికి దిగజారాడు. ఇక కీవీస్, భార‌త్ సీరీస్ లో అద్భుతంగా రాణించిన లాథ‌మ్ 18వ ర్యాంకుతో ఉండ‌గా కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ 94 ప‌రుగులు చేయ‌డంతో 10వ స్థానానికి చేరుకున్నాడు. జాబితా ప్ర‌కారం చూస్తే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ లో పాకిస్తాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ ఉండ‌గా రెండో స్థానం కూడా పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్(ICC ODI Rankings) నిలిచాడు.

ఇక మూడ‌వ స్థానంలో సౌతాఫ్రికా ప్లేయ‌ర్ డ‌స్సెన్ , నాలుగో స్థానంలో ఇదే దేశానికి చెందిన క్రికెట‌ర్ క్వింట‌న్ డికాక్ ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఐదో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. ఇక టాప్ 10 ఆల్ రౌండ‌ర్ల‌ను కూడా ఐసీసీ ప్ర‌క‌టించింది. ఇందులో ఏ ఒక్క భార‌తీయ క్రికెట‌ర్ లేక పోవ‌డం విశేషం.

Also Read : భార‌త్ ఓట‌మికి ఎన్నో కార‌ణాలు

Leave A Reply

Your Email Id will not be published!