Babu Mohan : టీడీపీ గూటికి చేరిన నటుడు మాజీ మంత్రి బాబు మోహన్

స్వర్గీయ నందమూరి తారకరామారావుపైన అభిమానంతో తెలుగు దేశం పార్టీలో చేరిన బాబు మోహన్....

Babu Mohan : తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. అలాగే నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్(Babu Mohan) తెలుగు దేశం సభ్యత్వం తీసుకున్నారు. మంగళవారం ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లుగా బాబు మోహన్ ఫోటోను విడుదల చేశారు.

Babu Mohan Joined..

స్వర్గీయ నందమూరి తారకరామారావుపైన అభిమానంతో తెలుగు దేశం పార్టీలో చేరిన బాబు మోహన్(Babu Mohan).. అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై… సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆపై టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, అలాగే 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయాడు. చివరకు 2023 ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేశారు. ఆపై మార్చ్‌లో ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు మోహన్ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం పండుగలా సాగుతోంది. ఈనెల 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. ముందుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. రూ.100లు కట్టి సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుంది. రూ.లక్ష కడితే పార్టీలో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ప్రమాదవశాత్తూ చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్థికసాయం అందిస్తారు.

Also Read : KTR : తెలంగాణ రెవిన్యూ మంత్రి టార్గెట్ గా మాజీ మంత్రి ఘాటు విమర్శలు

Leave A Reply

Your Email Id will not be published!