Nitish Kumar Wins : బీహార్ బల పరీక్షలో నెగ్గిన బాద్ షా
భారతీయ జనతా పార్టీ వాకౌట్
Nitish Kumar Wins : బీహార్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహా ఘట్ బంధన్ పేరుతో ఏర్పాటైన మహా కూటమి సర్కార్ పై బీజేపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో సీఎం నితీశ్ కుమార్ సత్తా చాటారు.
ఆయనకు ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలుపుకుని 164 సభ్యుల మద్దతు ఉంది. మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 121 మంది సభ్యుల బలం కలిగి ఉండాలి. కావాల్సిన దాని కంటే 43 మంది సభ్యుల బలగం ఎక్కువగా ఉండడంతో గెలుపొందడం షరా మామూలే.
కానీ 17 ఏళ్ల పాటు బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు బాద్ షా గా పిలుచుకునే సీఎం నితీశ్ కుమార్. దీంతో సంకీర్ణ సర్కార్ ఉన్న సమయంలో బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ గా ఉన్నారు.
చివరి వరకు ఆయన తన పదవికి రాజీనామా సమర్పించ లేదు. దీంతో కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే నాటకీయ పరిణామాల మధ్య తమ బలాన్ని నిరూపించు కోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వీకే సిన్హా తన స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వ్యవహారాన్ని నడిపించారు.
ఈ మేరకు మహా ఘట్ బంధన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పరీక్షలో ( బలపరీక్ష) నెగ్గినట్లు(Nitish Kumar Wins) ప్రకటించారు. దీంతో సభా ప్రాంగణం సంతోషంతో నిండి పోయింది. ఈ సందర్భంగా తాత్కాలిక స్పీకర్ మహేశ్వర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : బీహార్ స్పీకర్ వీకే సిన్హా రాజీనామా