Bairstow Livingstone : బెయిర్ స్టో అదుర్స్ లియామ్ సూపర్
ఆర్సీబీకి చుక్కలు చూపించారు
Bairstow Livingstone : ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ రేసులో ఏ జట్టు చేరుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లింది పంజాబ్ కింగ్స్ .
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఏకంగా 20 ఓవర్లలో 209 పరుగుల టార్గెట్ ముందుంచింది. దీంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే చాప చుట్టేసింది.
అంతకు ముందు టాస్ ఓడి పోయి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.
శిఖర్ ధావన్ మెరిసినా 21 రన్స్ కే వెనుదిరిగాడు. కానీ ఓపెనర్ బెయిర్ స్టో దుమ్ము రేపాడు. దంచి కొట్టాడు. 5 ఓవర్లు ముగిసే సరికే 50 పరుగులు దాటేసింది పంజాబ్ స్కోర్. 83 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
ఆ వికెట్ శిఖర్ ది. ఇక కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు బెయిర్ స్టో(Bairstow). మొత్తం 29 బంతులు మాత్రమే ఆడిన జాన్ 66 పరుగులు చేశాడు.
ఇందులో 7 సిక్సర్లు 4 ఫోర్లు ఉన్నాయి. ఈ ఫోర్లు , సిక్సర్లతోనే 58 రన్స్ చేశాడు. ఆర్సీబీకి చుక్కలు చూపిస్తున్న బెయిర్ స్టోను(Bairstow) షాబాద్ అహ్మద్ బోల్తా కొట్టించాడు.
ఆ ఆనందం కొద్ది సేపే మిగిలింది బెంగళూరుకు. మైదానంలోకి వచ్చినలియామ్ లివింగ్ స్టోన్ తానేమీ తీసిపోనంటూ దుమ్ము రేపాడు. 70 పరుగులు చేశాడు. 42 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టాడు.
ఇక జాన్ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్ లు కలిసి 133 రన్స్ చేశారు. వీరే జట్టులో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Also Read : లివింగ్ స్టోన్ జోర్దార్ ఇన్నింగ్స్