Balakrishna-Janareddy : ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇళ్లకు జిహెచ్ఎంసి మార్కింగ్

ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది...

Balakrishna : తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలకు బల్దియా షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్ళకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. కె.బి.ఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా మార్కింగ్ చేసింది. బాలకృష్ణ(Balakrishna) ఇంటిని ఆరడుగుల లోపల వరకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. కళింగ చౌరస్తా నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఆస్తుల సేకరణలో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. 86 ఆస్తుల సేకరణ లిస్టులో బాలయ్య, మాజీ మంత్రి జానారెడ్డి ఇళ్లు ఉన్నాయి. ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది. అయితే తన ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి(Janareddy) సీరియస్ అయ్యారు.

Balakrishna-Janareddy Houses Got Marked…

కాగామాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్‌లో భాగంగా బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12 లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు. బాలకృష్ణ ఇంటికి సుమారు ఆరు ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

కేబీఆర్పార్క్ చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్‌లు, ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జిలను ప్రభుత్వం నిర్మించనుంది. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. అలాగే జుబ్లీహల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్డు నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో ఫ్లై ఓవర్లు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలి గడువు అదే నెల 10న ముగియనుంది. ఈ లోపు పార్కు చుట్టూ కొన్నిచోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్‌లో ఒకేచోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిది.

Also Read : MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తామని బెదిరించడం సరైనది కాదు

Leave A Reply

Your Email Id will not be published!