NBK2 : బాల‌య్య అన్ స్టాప‌బుల్ -2 రెడీ

4న విజ‌య‌వాడ‌లో ఆహా ప్లాన్

NBK2 : ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణకు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. అటు వెండి తెర పైనే కాదు బుల్లి తెరపై దుమ్ము రేపాడు. అల్లు అర‌వింద్ కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ లో ఇప్ప‌టికే మోస్ట్ పాపుల‌ర్ షోగా పేరొందింది ఈ షో. అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే పేరుతో ఇప్ప‌టికే ప్రారంభించిన ఈ ప్రోగ్రాం జ‌నాద‌ర‌ణ పొందింది.

ఆశించిన దానికంటే ఎక్కువ ఆక‌ట్టుకుంది. రేటింగ్ లో టాప్ రేంజ్ లో కొన‌సాగింది. ఈ షో ఆహాలో ప్రారంభ‌మైన నాటి నుంచి ఎండింగ్ వ‌ర‌కు హృద‌యాల‌ను గెలుచుకుంది. ఈ షోకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఐఎండీబీ లో భార‌త్ లో ప్ర‌సార‌మ‌వుతున్న రియాల్టీ షోల‌లో బాల‌య్య బాబు(NBK2) హోస్ట్ చేస్తున్న అన్ స్టాప‌బుల్ ఎన్బీకే షో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది.

మాస్ ను అల‌రించ‌డంలో ఎలాంటి మ‌లుపులు లేని ఆహా తెలుగు లో మ‌రింత దూసుకు పోతోంది. ఈ ప్రోగ్రాం పూర్తిగా టాలీవుడ్ లెజెండ్స్ తో అనుబంధం క‌లిగి ఉండ‌డం ప్ర‌త్యేక‌త‌. డిజిట‌ల్ స్ట్రీమింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఈ షో అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా ముద్ర వేసింది. 100 శాతం ప‌క్కా లోక‌ల్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ రూపొందించింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ దీనికి క‌ర్త క‌ర్మ క్రియ అన్న‌మాట‌. జోంబీ రెడ్డి, క‌ల్కి, విస్మ‌యం వంటి అద్భుత‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరుంది. 2011లో దీన‌మ్మ జీవితం అనే షార్ట్ ఫిలింకి ద‌ర్శ‌క‌త్వం వహించ‌డం నుండి మాస్ కింగ్ కోసం ఎన్బీకే సీజ‌న్ -1తో అన్ స్టాప‌బుల్ ప్రోమో కోసం కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ఎన్బీకే -2 కి శ్రీ‌కారం చుట్టారు.

Also Read : పొన్నియిన్ సెల్వ‌న్ క‌లెక్ష‌న్ల సునామీ

Leave A Reply

Your Email Id will not be published!