Balka Suman-BRS : సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత
ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు...
Balka Suman : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్‌లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్ దగ్గర వికారాబాద్ రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కొడంగల్‌లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జెడ్పిటీస్ మహిపాల్ అడ్డుకున్నారని తెలిపారు. రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డికి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ అమెరికా పర్యటనలో స్వచ్ బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని… ఆ కంపెనీ రేవంత్ మరో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డిది అని తెలిపారు. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని అన్నారు.
Balka Suman Comment
ఇవే కాకుండా రేవంత్ సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఈ సంస్థల ద్వారానే రేవంత్ బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్ సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు.
Also Read : AP Cabinet Agree : సర్వే రాళ్లపై ఉన్న మాజీ సీఎం ఫోటోను తీయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్