BAN vs AFG Asia Cup 2022 : ఆఫ్గనిస్తాన్ దెబ్బకు బంగ్లా విలవిల
7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
BAN vs AFG Asia Cup 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022 మెగా టోర్నీలో ఆఫ్గనిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంక జట్టును మట్టి కరిపించింది.
రెండో మ్యాచ్ లో బంగ్లా దేశ్ ను(BAN vs AFG Asia Cup 2022) 7 వికెట్ల తేడాతో ఓడించింది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఈ కీలక మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది ఆఫ్గనిస్తాన్.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ ను ఆఫ్గాన్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం ఇంకా తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేజ్ చేశారు.
128 పరుగులను మూడు వికెట్లు కోల్పోయి సత్తా చాటారు. ఇబ్రహీం జద్రాన్ , నజీబుల్లా జద్రాన్ 33 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేయడంతో విజయం ఆఫ్గనిస్తాన్ ను వరించింది.
నజీబుల్లా 17 బంతులు మాత్రమే ఎదుర్కొని 43 పరుగులు చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. 18.3 ఓవర్లలో 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాడు. దీంతో రెండో మ్యాచ్ విజయంతో ఆఫ్గనిస్తాన్ సూపర్ – 4 దశకు చేరుకుంది.
అంతకు ముందు ముజీబ్ ఉర్ రెహ్మాన్ , రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో బంగ్లా దేశ్ 7 వికెట్లు కోల్పోయి 127 రన్స్ మాత్రమే చేసింది.
అంతకు ముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఇవాళ మరో కీలక మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Also Read : ఆసిస్ దెబ్బకు ఠారెత్తిన జింబాబ్వే