BAN vs ZIM T20 World Cup : జింబాబ్వే పోరాటం బంగ్లా విజయం
3 పరుగుల తేడాతో జింబాబ్వే ఓటమి
BAN vs ZIM T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే అద్బుతమైన పోరాట పటిమను కనబర్చింది. ఇప్పటికే బలమైన పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది జింబాబ్వే . కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఇక బంగ్లాదేశ్ తో(BAN vs ZIM T20 World Cup) జరిగిన కీలక పోరులో చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ చోటు చేసుకుంది. కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒకానొక దశలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. కీలక సమయంలో విలియమ్స్ రనౌట్ కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు.
ఒక వేళ రనౌట్ కాక పోయి ఉంటే బంగ్లాకు షాక్ తగిలి ఉండేది. ఈ గెలుపుతో గ్రూప్ -2 గ్రూపులో బంగ్లాదేశ్ 4 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో కొనసాగుతోంది టీమిండియా నాలుగు పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 3 పాయింట్లతో మూడవ స్థానానికే పరిమితమైంది.
ఇక మ్యాచ్ పరంగా చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. శాంటో 71 రన్స్ చేసి సత్తా చాటాడు. షకీబుల్ హసన్ 23 రన్స్ చేస్తే హుస్సేన్ 29 పరుగులతో రాణించారు.
అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేయడంతో పరాజయం మూటగట్టుకుంది. సీన్ విలియమ్స్ 42 బంతులు ఆడి 8 ఫోర్లతో 64 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.
ఒక రకంగా నైతిక విజయాన్ని సాధించింది జింబాబ్వే.
Also Read : రాహుల్ యాత్రలో అజ్జూ భాయ్