Bandaru Satyanarayana Comment : వ్యక్తిత్వ హననం జుగుస్సాకరం
తెలుగుదేశం ఏం చేస్తోంది
Bandaru Satyanarayana Comment : రాజకీయాలు మరింత దిగజారి పోతున్నాయి. సభ్య సమాజం సిగ్గు పడేలా ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు వ్యవహరిస్తున్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి బండారు సత్య నారాయణ(Bandaru Satyanarayana) సంచలనంగా మరారు. కారణం సాక్షాత్తు ఒక మహిళ పట్ల, ప్రత్యేకించి బాధ్యత కలిగిన కేబినెట్ హోదాలో ఉన్న ఆర్కే రోజా సెల్వమణిపై అనరాని మాటలు అన్నారు. తన ఇంట్లో మహిళలు ఉన్నారని, తను కూడా ఓ బిడ్డకు తండ్రేనని మరిచి పోయారు. ఈయన గారి మాటలు కన్నీళ్లు పెట్టించాయి. తీవ్ర దుమారం రేపినా ఇప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పలేక పోయారు సదరు మాజీ మంత్రి. కులం, అధికార మదం, ఆర్థిక మందం ఉండడంతో ఇలాంటి కామెంట్స్ ఈ మధ్యన మరీ ఎక్కువై పోయాయి. పాలిటిక్స్ పరంగా ఒకరిపై మరొకరు మాట్లాడు కోవడంలో, ఆరోపణలు చేయడంలో, విమర్శించడంలో తప్పు లేదు. కానీ ఏ కామెంట్స్ అయినా సభ్య సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి.
Bandaru Satyanarayana Comment Viral
పది మంది మెచ్చుకునే రీతిలో ఉండాలి. కానీ ఇవేవీ పట్టడం లేదు. ప్రత్యేకించి పట్టించు కోవడం లేదు. ఎంతగా దూషిస్తే, ఎంతగా బూతులు మాట్లాడితే వాళ్లు అంత త్వరగా పాపులర్ అయి పోతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియా మరింత ప్రాముఖ్యత సంతరించు కోవడంతో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ట్రెండింగ్ లో ఉండాలని అనుకుంటున్నారు. కానీ గతంలో తెలుగుదేం పార్టీ ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో కొలువు తీరిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Bandaru Satyanarayana) నోరు పారేసుకున్నారు. ఆపై రోజాను అనరాని మాటలు అన్నారు. అంతే కాదు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసేలా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. మంత్రి స్థాయి అని మరిచి పోయి రోజా వ్యక్తిత్వాన్ని కించ పర్చేలా మాట్లాడారు. ఆమె బ్లూ ఫిలిమ్స్ (నీలి చిత్రాలు) లలో నటించందని , అందుకు సంబంధించినవి తన వద్ద ఉన్నాయని ప్రకటించారు. అంతే కాదు గతంలో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలలో మిర్యాలగూడలో రోజా ఎవరెవరితో పడుకుందో కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయా లాడ్జీలకు సంబంధించి కూడా బండారు బండారం బయట పెట్టారు.
ఓ వైపు పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 45 ఏళ్ల రాజకీయం అంటూ బీరాలు పలికారు. ఇప్పుడు ఏపీ స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయనకు సంఘీభావం తెలపాల్సిన మాజీ మంత్రి బాధ్యతలను మరిచి పోయి ఫ్రస్టేషన్ తో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇంకా ఢిల్లీ మహిళా కమిషన్ స్పందంచ లేదు. ఇదే విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. వెంటనే బండారును అరెస్ట్ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఇదే మాటలు నందమూరి ఫ్యామిలీకి చెందిన లేడిస్ గురించి అంటే ఊరుకుంటారా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయాలు మాట్లాడితే ఓకే కానీ వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా, హరించేలా మాట్లాడే ఏ హక్కు ఎవరికీ లేదు. ఇకనైనా టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. లేక పోతే ఆ పార్టీకే తీరని నష్టం తెస్తుందని తెలుసుకోవాలి.
Also Read : PM Modi : ములుగు జిల్లాకు ట్రైబల్ యూనివర్శిటీ