Bandla Ganesh : హైదరాబాద్ – తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా హైటెక్ సిటీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Bandla Ganesh Comments Viral
చంద్రబాబు నాయుడు కోసం తాను చచ్చి పోయేందుకు సిద్దమన్నారు. ఆయన వల్లనే ఇవాళ హైదరాబాద్ అభివృద్ది చెందింది అన్నారు. ఆయనను కావాలని కక్ష సాధింపు ధోరణితోనే జైలు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 50 రోజులు పూర్తయినా ఇంకా బయటకు రాలేదన్నారు.
బండ్ల గణేష్(Bandla Ganesh) ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. షాద్ నగర్ వద్ద పౌల్టీ ఫామ్ పెట్టాడు. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా మారాడు. పలు సినిమాలు నిర్మించాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భక్తుడిగా మారాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు.
అదే తమిళనాడు, మహారాష్ట్రలో అయితే చంద్రబాబు నాయుడు పుట్టి ఉంటే ఈపాటికి ఆయనను తమ భుజస్కందాల మీద మోసేవారని అన్నారు బండ్ల గణేష్. బాబును పొగుడుతూ ఆవేశంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read : AP Trains Stop : ఏపీలో మరో 8 రైళ్లు రద్దు