Bangladesh : భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బాంగ్లాదేశ్
భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు...
Bangladesh : బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒక పూట పస్తులు ఉంటాం కానీ, భారత వస్తువులు అక్కర్లేదని ముస్లిం ఛాందసవాదులు అక్కడ భారీ ఆందోళన చేపట్టారు. భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఆ దేశానికి ఎగుమతులు ఆపేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ కౌంటర్‌గా ముస్లిం సంఘాలు బంగ్లాదేశ్(Bangladesh)లో ఆందోళన చేపట్టాయి. అసలు భారత్‌తో గొడవలు కోరుకోవడం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుంటే మతఛాందసవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు.
Bangladesh Damages…
భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భారత్‌లో బంగ్లా జెండాకు అవమానం జరిగిందని, అందుకే భారత వస్తువులను బహిష్కరిస్తునట్టు ప్రకటించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మహిళలు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చీరెలను కట్టుకోరాదని బ్యాన్ విధించారు. అంతేకాకుండా భారత సబ్బులు , టూత్‌పేస్ట్‌లు కూడా వాడరాదని నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థ గురువు చిన్మయ్‌దాస్‌ను అరెస్ట్ చేసినప్పటికి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. మరోవైపు చిన్మయ్‌దాస్‌కు బెయిల్ ఇవ్వకపోవడంపై పార్లమెంట్‌లో కూడా ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో అల్లర్ల తరువాత సరిహద్దుల్లో కూడా హైఅలర్ట్ కొనసాగుతోంది. చొరబాట్లను అరికట్టడానికి బీఎస్‌ఎఫ్ గట్టి చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్‌కు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలను పంపించాలని సాధువులు కోరుతున్నారు.
Also Read : AP News : ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్న గూగుల్