Bangladesh Violance : బాంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ‘ఒబైదుల్లా హస్సన్’ రాజీనామా

ఈ ఉద్రిక్త వాతావరణ నడుమ పుల్ కోర్టు మీటింగ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు...

Bangladesh : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒబైదుల్లా హస్సన్ రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢాకాలోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. గంట వ్యవధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికీ రాజీనామా చేయాలని ఒబైదుల్లా హస్సన్‌(Obaidul Haasan)కు వారు ఆల్టిమేటం జారీ చేశారు. ఓ వేళ రాజీనామా చేయకుంటే.. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల నివాసాలను చుట్టుముడుతామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం, దిగువ కోర్టుల న్యాయమూర్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రంలోగా తన రాజీనామా లేఖను అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌కు పంపుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ది డైలీ స్టార్ వెల్లడించింది.

Bangladesh Violance..

ఈ రోజు ఉదయం ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులందరికీతో సమావేశం కానున్నారనే ఓ ప్రచారం అయితే దేశవ్యాప్తంగా నడిచింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, న్యాయవాదులతో కలిసి వందలాది మంది ఆందోళన కారులు సుప్రీంకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేపట్టారు. బంగ్లాదేశ్‌(Bangladesh)లో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలకు తెర తీసే అవకాశముందే సందేహలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు సుప్రీంకోర్టుకు భారీగా చేరుకున్నారు.

ఈ ఉద్రిక్త వాతావరణ నడుమ పుల్ కోర్టు మీటింగ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీనిని ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో.. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ప్యూ విధించింది. అయినా పరిస్థిలు మాత్రం అదుపులోకి రాలేదు. దీంతో విద్యార్థి సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అవి సైతం విఫలయ్యాయి. ఆ కొద్ది రోజులకే ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ వెల్లువెత్తింది.

దీంతో దేశంలో ఆందోళనలు, నిరసనలు సైతం మిన్నంటాయి. పరిస్థితులు చెయ్యి దాటి పోవడంతో.. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఆమె తన సోదరి రెహానాతో కలిసి భారత్‌లో తలదాచుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రొ. యూనుస్‌ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వాన్ని సైతం కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశముందని విద్యార్ధులు, న్యాయవాదులు, ఆందోళన కారులు భావించారు. ఆ క్రమంలో ఈ రోజు వారంతా సుప్రీంకోర్టుకు భారీ ఎత్తున చేరుకున్నారు.

Also Read : Wayanad Landslide-Modi : వాయనాడ్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోదీ

Leave A Reply

Your Email Id will not be published!