Bank Manager Shot : కాశ్మీర్ లో బ్యాంక్ మేనేజర్ కాల్చివేత
72 గంటల్లో ఒకరు టీచర్ మరొకరు మేనేజర్
Bank Manager Shot : జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నిన్న మహిళా హిందూ టీచర్ ను కాల్చి చంపిన ఉగ్రమూకలు బ్యాంక్ మేనేజర్(Bank Manager Shot) ను పొట్టన పెట్టుకున్నారు.
72 గంటల్లో ఇద్దరు కాల్పులకు గురి కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. కుల్గామ్ లోని ఎలాఖాహి దేహతి బ్యాంక్ అరేహ్ బ్రాంచ్ లోకి ప్రవేశించిన ఓ ఉగ్రవాది బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ పై దాడికి పాల్పడ్డాడు.
దాడి అనంతరం మేనేజర్(Bank Manager Shot) ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తుది శ్వాస విడిచాడు. హంతకుడు బ్రాంచ్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపి పారిపోతున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో ఉంది.
రాజస్తాన్ లోని హనుఉమాన్ గఢ్ జిల్లా కు చెందిన వ్యక్తి విజయ్ కుమార్ . ఇటీవలే కుల్గాంలో తన పోస్టింగ్ లో చేరాడు. ఇదిలా ఉండగా దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
జమ్మూకి చెందిన రజనీ బాలా అనే హిందూ ఉపాధ్యాయురాలిని కుల్గామ్ పాఠశాల వెలుపల ఉగ్రవాదులు చంపిన రెండు రోజులకే ఈ దాడి జరిగింది.
పక్కనే ఉన్న షోపియాన్ జిల్లాలో రెండు పెద్ద ఘటనలు జరిగిన 24 గంటల్లోనే కుల్గామ్ లో బ్యాంక్ మేనేజర్ హత్య జరిగింది. ఫరూఖ్ అహ్మద్ షేక అనే పౌరుడు నిన్న సాయంత్రం తన ఇంటిలో జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డాడు.
మరో సంఘటనలో గురువారం తెల్లవారుజామున బయలు దేరిన సైనిక వాహనంలో పేలుడు సంభవించింది. ముగ్గురు సైనికులు గాయపడగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read : కుల్గామ్ లో హిందూ టీచర్ కాల్చివేత