Bank Scams : 77,654 స్కామ్ లు 60 వేల 530 కోట్లు ఫ్రాడ్
2,729 మంది ఉద్యోగుల కీలక పాత్ర
Bank Scams : దేశంలో దొంగలు పడ్డారు. ప్రధానంగా ఆర్థిక నేరగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకుల్లో 60 వేల కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 2, 729 మంది బ్యాంకు ఉద్యోగులు మోసానికి(Bank Scams) పాల్పడ్డారు.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 77 వేలకు పైగా కోట్లకు పైగా మోసాలు జరిగాయి. ఈ కుంభకోనాల్లో 60 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి.
ప్రతి రోజూ 212 కుంభకోణాలు, రూ. 165 కోట్ల అక్రమాలు జరగడం విశేషం. ఈ సమాచారం నాగ్ పూర్ లో సమచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది. మొత్తం 60 వేల 530 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఇదిలా ఉండగా అందిన సమాచారం ప్రకారం ఈ కుంభకోణాలలో 2,729 మంది బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వారిపై ఎటువంటి చర్యలు, రికవరీ గురించి సమాచారం అందించ లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, సహకార సంస్థలు కూడా నష్టాలను చవి చూశాయని ఆర్టీఐ కార్యకర్త అభయ్ కోలాకర్ వెల్లడించారు.
మొత్తంగా చూస్తే 2,278 మంది బడా ఆర్థిక నేరగాళ్లు ఎవరనేది ఇంత వరకు వెల్లడించక పోవడం విశేషం. దాదాపు 1,84,863 కోట్లు కొల్లగొట్టినట్లు తాజా సమాచారం. ఇందులో 312 మంది బడా బాబులు ఎగవేసింది 76 శాతానికి పైగా ఉండడం గమనార్హం.
పుణె ఆర్టీఐ కార్యకర్త వివేక్ వేలంకర్ కోరగా 100 కోట్లకు పైబడి ఎగవేసిన 312 మంది పేర్లు వెల్లడించబోమని స్పష్టం చేయడం దేనికి సంకేతమో ఆర్థిక సంస్థ చెప్పాలి.
Also Read : డిజిటలైజేషన్ తో సామాజిక భద్రత – మోదీ