Bappi Lahari Funeral : బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పీలహరి అంతిమయాత్ర ముగిసింది. ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంత లోకాలకు వెళ్లి పోయాడు డిస్కో కింగ్. ఆయనకు అత్యంత ఇష్టమైన సన్ గ్లాసెస్ ను పార్థివ దేహంపై ఉంచారు.
69 ఏళ్ల పాటు ఈ లోకంలో ఉన్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన వాటిలో చాలా మటుకు విజయవంతం అయ్యాయి. ముంబై లోని జుహు లోని ఇంటి నుంచి పవన్ హాన్స్ శ్మశాన వాటిక వరకు యాత్ర సాగింది.
దారి పొడవునా బప్పీదా అమర్ రహే అంటూ అభిమానులు, సినీ ప్రముఖులు నినాదాలు చేశారు. సినీ దిగ్గజాలు సైతం హాజరయ్యారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న కుమారుడు బప్పా హాజరు అయ్యేందుకు గాను నిన్న అంత్యక్రియలు జరగలేదు.
ఇవాళ నిర్వహించారు. రాణీ ముఖర్జీ సోదరుడు రాజా పాల్ బేరర్ కూడా పాల్గొన్నారు. అంత్య క్రియల కార్యక్రమానికి ఊహించని రీతిలో అభిమానులు హాజరయ్యారు.
వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బప్పీలహరి(Bappi Lahari Funeral) సోదరి రెమ కూడా ఉన్నారు. కుటుంబీకులు, స్నేహితులు హాజరయ్యారు. వారిలో నటి విద్యా బాలన్ కన్నీటి పర్యంతం అయ్యారు.
తనను ప్రేమగా బిడ్డా అని పిలిచే వారంటూ గుర్తు చేసుకున్నారు. దివంగత దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ కు బప్పీలహరి బంధువు కూడా.
ప్రముఖ నటుడు బిస్వజిత్ ఛటర్జీ, అనిల్ కపూర్, అమృతా సింగ్ , షర్బానీ ముఖర్జీ హాజరయ్యారు నివాళులు అర్పించారు.
Also Read : ‘జీ సరిగమప’ కోసం పూజా హెగ్డే