Case File RGV : బ‌ర్రెల‌క్క‌పై కామెంట్స్ ఆర్జీవీపై కేసు

తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ లో ఫిర్యాదు

Case File RGV : హైద‌రాబాద్ – నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బ‌ర్రెల‌క్క‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కొల్లాపూర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను పోటీ చేసింది. ఇటు తెలంగాణ‌లో అటు ఏపీలో సంచ‌ల‌నంగా మారారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు బ‌ర్రెల‌క్క‌. ఆమె అస‌లు పేరు శిరీష‌. త‌ను రీల్స్ చేస్తూ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యారు. 5,975 ఓట్లు పొందారు. మిగ‌తా పార్టీ అభ్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించారు.

Case File RGV from Barrelakka

ఇదిలా ఉండ‌గా వ్యూహం సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) బ‌ర్రెల‌క్క‌కు సంబంధించి కామెంట్స్ చేశారు. ఆమె ఎవ‌రో ఈ మ‌ధ్య‌న ఫేమ‌స్ అయ్యింది క‌దూ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో త‌న గౌర‌వానికి భంగం క‌లిగించేలా ఆర్జీవీ మాట్లాడటం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంటూ బ‌ర్రెల‌క్క త‌ర‌పు లాయ‌ర్ తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారు.

ఊరు పేరు లేని ఆమె ఫేమ‌స్ అయి పోయిందంటూ సెటైర్ వేశారు. బ‌ర్రెలు ల‌క్క కూడా ఆమె వింటున్నారు..అందుకే ఆమెను బ‌ర్రెల‌క్క అని పిలుస్తున్నారంటూ కించ ప‌రిచేలా కామెంట్స్ చేశారంటూ లాయ‌ర్ ఫిర్యాదు చేశారు. త‌ను బ‌త‌కాల‌ని అనుకుంటే బ్లూ ఫిలింలు తీస్తూ బ‌త‌కొచ్చ‌ని కానీ ఇలా తెలంగాణ బిడ్డ‌ల‌పై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : Achechennaidu : జ‌గ‌న్ దోచుకున్నదంతా క‌క్కిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!