Basit Ali Azaharuddin : అజ్జూ భాయ్ పై బాసిత్ అలీ కామెంట్స్
స్లెడ్జింగ్ చేయలేదని ప్రకటన
Basit Ali Azaharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ పై సంచలన కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ. తాము ఆడుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ , అజయ్ జడేజా, నవ జ్యోత్ సింగ్ సిద్దూలను చికాకు పరచాలని మాకు జట్టు నుంచి ఆదేశాలు ఉండేవని పేర్కొన్నాడు.
కానీ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అజ్జూ భాయ్ విషయంలో అలాంటిది లేదన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుకు అజహరుద్దీన్ అంటే గౌరవం ఉండేదన్నాడు బాసిత్ అలీ. ప్రస్తుతం బాసిత్ అలీ(Basit Ali ) చేసిన వ్యాఖ్యలు వరల్డ్ క్రికెట్ లో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ లో అజహరుద్దీన్ కీలకంగా ఉన్నాడని లోకం కోడై కూసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న దక్షిణా ఫ్రికా క్రికెటర్ హాన్సీ క్రోనే చని పోయాడు. ఇప్పటికీ అజహరుద్దీన్ పై అనుమానపు నీలి నీడలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయంటే విపరీతమైన ఉత్కంఠ ఉండేదన్నాడు బాసిత్ అలీ.
అంతే కాదు సెడ్జింగ్ చేయడం అన్నది మామూలు విషయమని పేర్కొన్నాడు. అయితే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సెడ్జింగ్ సర్వ సాధారణమని స్పష్టం చేశాడు. దిగ్గజ ఆటగాళ్లను డిస్టర్బ్ చేయమన టీమ్ మేనేజ్ మెంట్ ప్లేయర్లకు చెప్పిందని సంచలన విషయం బయట పెట్టాడు.
అయితే పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ అంటే చాలా గౌరవం ఉండేదన్నాడు. అక్రమ్ , సలీం మాలిక్ , రషీద్ లతీఫ్ , ఇంజమామ్ ఉల్ హక్ , వకార్ యూనిస్ ఎవరూ అజహరుద్దీన్ ను స్లెడ్జింగ్ చేసేందుకు ధైర్యం చేయరని పేర్కొన్నాడు బాసిత్ అలీ(Basit Ali) .
Also Read : టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్య