Chetan Sharma Kohli : కోహ్లీపై చేత‌న్ శ‌ర్మ షాకింగ్ కామెంట్స్

స్టింగ్ ఆప‌రేష‌న్ లో సంచ‌ల‌న విష‌యాలు

Chetan Sharma Kohli : భార‌త క్రికెట్ రంగంలో పెను సంచ‌ల‌నానికి దారి తీసేలా కామెంట్స్ చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు సెలక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ , మాజీ స్టార్ పేస‌ర్ చేత‌న్ శ‌ర్మ‌. బీసీసీఐ మాజీ చీఫ్ , ప్ర‌స్తుత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌ధ్య విభేదాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. అంతే కాదు స్టింగ్ ఆప‌రేష‌న్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు చేత‌న్ శ‌ర్మ‌(Chetan Sharma Kohli). ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. గంగూలీ అబ‌ద్దం చెప్ప‌లేని కోహ్లీనే అబ‌ద్దం ఆడాడంటూ బాంబు పేల్చాడు. 2021 చివ‌రి నెల‌లో కోహ్లీ, దాదా మ‌ధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంద‌న్నాడు చేత‌న్ శ‌ర్మ‌.

ఓ ప్రైవేట్ ఛాన‌ల్ చేసిన స్టింగ్ ఆప‌రేష‌న్ ఇప్పుడు తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. ఇటీవ‌లే చేత‌న్ శ‌ర్మ బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీకి రెండోసారి చైర్మ‌న్ గా ఎంపిక‌య్యాడు. అయితే బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌దు. కానీ ఉన్న‌ట్టుండి ప్ర‌స్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా కొన‌సాగుతున్న త‌రుణంలో షాకింగ్ కామెంట్స్ చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. బీసీసీఐలో చోటు చేసుకున్న రాజ‌కీయాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి.

స‌ఫారీ టూర్ కు ముందు వ‌న్డే జ‌ట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని త‌ప్పించిన త‌ర్వాత వివాదం మొద‌లైంది. గంగూలీ చేసిన ప్ర‌క‌ట‌నపై మండిప‌డ్డాడు కోహ్లీ. దానిపై దుమారం చెల‌రేగింది. టీ20 జ‌ట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు కోహ్లీ. అదే స‌మ‌యంలో వ‌న్డే జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. దీనిపై త‌న‌కు కనీస స‌మాచారం ఇవ్వ‌లేద‌ని ఆరోపించాడు విరాట్ కోహ్లీ.

Also Read : ఫిట్ నెస్ కోసం ఇంజెక్ష‌న్లు – చేత‌న్ శ‌ర్మ‌

Leave A Reply

Your Email Id will not be published!