Virat Kohli : ఇక‌నైనా ర‌న్ మెషీన్ రాణిస్తాడా

లేక చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో చేతులెత్తేస్తాడా

Virat Kohli : భార‌త జ‌ట్టులో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఉంటాడో ఉండ‌డో అన్న అనుమానాల‌కు తెర దించింది బీసీసీఐ. సెలెక్ష‌న్ క‌మిటీ ఆగ‌స్టు 27 నుంచి యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆసియా కప్ -2022 కోసం 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.

గ‌త కొంత కాలంగా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు కోహ్లీ(Virat Kohli). సెంచ‌రీ చేసి చాన్నాళ్ల‌యింది. కెప్టెన్ గా వైదొలిగిన త‌ర్వాత మినిమం స్కోర్ కూడా చేయ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఒక‌ప్పుడు ట‌న్నుల కొద్దీ ప‌రుగుల‌ను సాధించి చ‌రిత్ర సృష్టించిన ఈ బ్యాట‌ర్ ఇప్పుడు క్రీజులో ఉంటే చాలని అనుకునే ప‌రిస్థితికి వ‌చ్చింది. గ‌త కొంత కాలంగా బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ కూడా అత‌డిని రెస్ట్ పేరుతో ప‌క్క‌న పెట్టింది.

దీంతో కోహ్లీ కెరీర్ క‌థ ముగిసిన‌ట్టేన‌ని భావించారంతా. విచిత్రం ఏమిటంటే ఎవ‌రైనా ఫామ్ లో ఉన్న వాళ్ల‌ను తీసుకుంటారు. కానీ బీసీసీఐలో రాజ‌కీయాలు ఎక్కువ‌. అందుకేనేమో రన్ మెషీన్ కు చాన్స్ ఇచ్చారు.

ఆపై స‌త్తా చాటుతున్న సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఆసియా క‌ప్ లో మొద‌టి మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో ఆడుతుంది భార‌త జ‌ట్టు.

టి20 ప‌రంగా చూస్తే పాకిస్తాన్ తో త‌న 100వ మ్యాచ్ ఆడుతుండ‌డం విశేషం. పూర్వ వైభ‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడా లేక సేమ్ సీన్ రిపీట్ చేస్తాడా అన్న‌ది వేచి చూడాలి.

ఇక మాజీ ఆట‌గాళ్లు అయితే కోహ్లీని(Virat Kohli)  తీసేసి కొత్త వారికి చాన్స్ ఇవ్వాల‌ని కోర‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఇక అభిమానులు మాత్రం కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు.

Also Read : సంజూ శాంస‌న్ పై బీసీసీఐ వివ‌క్ష

Leave A Reply

Your Email Id will not be published!