Under 19 Team India Prize : వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు రూ. 5 కోట్లు

భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ

Under 19 Team India Prize :  ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 లో ఇంగ్లండ్ జ‌ట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి విశ్వ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అపూర్వమైన రీతిలో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసి భార‌త దేశ పతాకాన్ని త‌ల ఎత్తుకునేలా చేసిన అండ‌ర్ 19 మ‌హిళా క్రికెట‌ర్ల‌కు, సిబ్బందికి భారీ న‌జ‌రానా(Under 19 Team India Prize) ప్ర‌క‌టించింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ఈ మేర‌కు బీసీసీఐ బాస్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా కీల‌క ప్రక‌ట‌న చేశారు.

ఈ మేర‌కు తొలి ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్నందుకు అభినంద‌న‌లు తెలిపారు. అంతే కాకుండా భార‌త జ‌ట్టుకు, సిబ్బందికి మొత్తం రూ. 5 కోట్ల రూపాయ‌లు న‌జ‌రానాగా ఇస్తున్నట్లు వెల్ల‌డించారు బిన్నీ, జే షా. భార‌త జ‌ట్టు కెప్టెన్లు రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , సునీల్ గ‌వాస్క‌ర్ , త‌దిత‌రులు కంగ్రాట్స్ తెలిపారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి. మీరు సాధించిన ఈ విజ‌యం అపురూపం. ప్ర‌శంస‌నీయం. భావి త‌రాల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఇలాగే విజ‌యాలు సాధించాల‌ని ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల‌ని కోరారు.

అంతే కాకుండా జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క మ‌హిళా క్రికెట‌ర్ కు రూ. ల‌క్ష చొప్పున బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది బీసీసీఐ. ఇదిలా ఉండ‌గా ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌హీంద్రా కంపెనీ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా అమ్మాయిలు దేనికీ తీసిపోర‌ని రుజువు చేశారంటూ కొనియాడారు. వారిని స‌మున్న‌తంగా స‌త్క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు ట్విట్ట‌ర్ వేదిక‌గా.

Also Read : భార‌త్ కు దేవ‌గ‌న్..ఈషా కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!