BCCI Punish : గౌతమ్ గంభీర్..కోహ్లీకి జరిమానా
బీసీసీఐ సంచలన ప్రకటన
BCCI Punish : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ , ఆర్సీబీ మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి స్పందించింది. మ్యాచ్ లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం కరచాలనం సందర్బంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్, మాజీ క్రికెటర్ ,బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ , విరాట్ కోహ్లీ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇద్దరూ మైదానంలో హుందాగా ప్రవర్తించాల్సిన వాళ్లు చివరకు తిట్టుకుని, కొట్టుకునేంత దాకా వెళ్లారు.
దీనిపై ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ప్రవర్తనా నియమావళి కమిటీ విచారణ చేపట్టింది. ఈ మేరకు బీసీసీఐ రంగంలోకి దిగింది. గౌతమ్ గంభీర్ , విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు బీసీసీఐ(BCCI Punish) పేర్కొంది. ఐపీఎల్ 2023 ప్రవర్తనా నియమావళిని ఇద్దరూ ఉల్లంఘించారని తెలిపింది. కోహ్లీ, గంభీర్ గొడవ పడడం కలకలం రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇది భారీ భావోద్వేగానికి దారి తీసింది.
ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ కు మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించినట్లు ఐపీఎల్ తెలిపింది. ప్రవర్తనా నియమావళి లోని ఆర్టికల్ 2.21 ప్రకారం గంభీర్ లెవల్ 2 నేరాన్ని అంగీకరించాడు. ఇదే సమయంలో ఆర్సీబీ ఆటగాడు కోహ్లీకి కూడా మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేసినట్లు పేర్కొంది.
Also Read : మలింగను దాటేసిన మిశ్రా