India Squad Asia Cup 2022 : కోహ్లీకి చాన్స్ సంజూ శాంస‌న్ మిస్

ఆసియా క‌ప్ కు భార‌త జ‌ట్టు డిక్లేర్

India Squad Asia Cup 2022 : యూఏఈ వేదిక‌గా ఆగ‌స్టులో జ‌రిగే ఆసియా క‌ప్ కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(India Squad Asia Cup 2022) (బీసీసీఐ) జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన టీంను ఎంపిక చేసింది.

పూర్ ప‌ర్ ఫార్మెన్స్ తో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఉంటాడా లేదోన‌న్న ఉత్కంఠ‌కు పుల్ స్టాప్ పెట్టింది. ఇక కోహ్లీకి చాన్స్ ఇచ్చింది. కానీ పుల్ ఫామ్ లో కొన‌సాగుతున్న కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ , వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ కు మొండి చేయి చూపించింది.

ఇక గాయం కార‌ణంగా దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్, అక్ష‌ర్ ప‌టేల్ , దీప‌క్ చాహ‌ర్ స్టాండ్ బై ఆట‌గాళ్లుగా చాన్స్ ఇచ్చింది.

ఇక గాయం కార‌ణంగా బుమ్రా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను ప‌క్క‌న పెట్టింది. ఇదిలా ఉండ‌గా ఆసియా క‌ప్ -2022 ను శ్రీ‌లంక‌లో నిర్వ‌హించాల్సి ఉంది.

కానీ ఆ దేశంలో నెల‌కొన్న ఆర్థిక‌, ఆహార‌, రాజ‌కీయ సంక్షోభం కార‌ణంగా శ్రీ‌లంక క్రికెట్ బోర్డు తాము నిర్వ‌హించ లేమంటూ ఐసీసీకి విన్న‌వించింది.

దీంతో ప్ర‌త్యామ్నాయంగా యూఏఈని ఎంపిక చేసింది. గ‌త ఏడాది టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కూడా ఇక్కే నిర్వ‌హించారు. ఇక ఆసియా క‌ప్

ఆగ‌స్టు 27 నుంచి ప్రారంభం కానుంది.

మొత్తం ఆరు జ‌ట్లు పాల్గొంటాయి. పీసీబీ పాకిస్తాన్ ను ప్ర‌క‌టించింది. తొలి మ్యాచ్ ఎప్ప‌టి లాగే పాక్ తో ఆడ‌నుంది భార‌త్.

టీమ్ ప‌రంగా చూస్తే రోహిత్ శ‌ర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్. కోహ్లీ, సూర్య కుమార్ , దీప‌క్ హూడా, రిష‌బ్ పంత్ , దినేష్ కార్తీక్ ,

హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, ఆర్. అశ్విన్ , వై చాహ‌ల్ , బిష్నోయ్ , భువీ, ఆర్ష్ దీప్ సింగ్ , ఆవేష్ ఖాన్ ఉన్నారు.

Also Read : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ భ‌ళా

Leave A Reply

Your Email Id will not be published!