India Squad : జింబాబ్వే టూర్ కు టీమిండియా డిక్లేర్
భారత జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్
India Squad : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత కొంత కాలంగా సెలెక్షన్ కమిటీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇప్పటికే 7 మందిని కెప్టెన్లుగా మార్చింది. ఎవరు చివరి వరకు ఉంటారో తెలియడం లేదు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేపట్టింది.
ఉన్నట్టుండి గాయం నుండి కోలుకున్న కేఎల్ రాహుల్ కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇంకో వైపు హార్దిక్ పాండ్యాను కూడా లైన్ లో పెట్టింది.
ఇదే ఏడాది యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో ప్రకటించిన టీమ్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా జింబాబ్వేలో భారత జట్టు జింబాబ్వేలో వన్డే సీరీస్ ఆడనుంది.
గతంలో శిఖర్ కు చాన్స్ ఇస్తే ఉన్నట్టుండి అతడిని పీకేశారు. ప్రస్తుతం ధావన్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. మొత్తం 16 మందితో(India Squad) కూడుకున్న జట్టును డిక్లేర్ చేసింది.
భారత జట్టు ఈనెల 18, 20 , 22 తేదీలలో హరారేలో మూడు వన్డేలు ఆడుతుంది. ఇక జట్టు పరంగా చూస్తే ఇలా ఉంది.
కేఎల్ రాహుల్ కెప్టెన్, ధావన్ వైస్ కెప్టెన్. గైక్వాడ్ , గిల్ , హూడా, త్రిపాఠి, సంజూ శాంసన్ , కిషన్ , సుందర్ , ఠాకూర్ , కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్ , ఆవేశ్ ఖాన్ , ప్రసిద్ధ్ కృష్ణ, దీపక చాహర్ , సిరాజ్ ఆడనున్నారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ సెలెక్టర్లు అనుసరిస్తున్న పద్దతిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
Also Read : మూడు ఫార్మాట్ లలో బాబర్ టాపర్