Team India : పాండ్యాకు టి20 రోహిత్ కు వన్డే..టెస్ట్ ఛాన్స్
కీలక మార్పులకు బీసీసీఐ శ్రీకారం
Team India : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఊహించని రీతిలో భారత జట్టు(Team India) సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ వెంటనే పాండ్యా సారథ్యంలో టి20, శిఖర్ ధావన్ నేతృత్వంలో వన్డే జట్టు కీవీస్ టూర్ లో ఆడుతోంది.
ఈ తరుణంలో భారత జట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించనున్నట్లు టాక్. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. వచ్చే ఏడాది 2023లో ప్రతిష్టాత్మకమైన టోర్నీలు జరగనున్నాయి. ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగనుండగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది.
ప్రస్తుతం భద్రతా కారణాల వల్ల ఇండియా పాకిస్తాన్ కు వెళ్లదని ఇప్పటికే బీసీసీఐతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
మరో వైపు హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ భవితవ్యంపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతానికి లక్ష్మణ్ కీవీస్ టూర్ కు తాత్కాలిక కోచ్ గా ఉన్నాడు.
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్ పై కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది బీసీసీఐ(BCCI). ఈ మేరకు ముంబైలో సమావేశం కానుంది. బంగ్లాదేశ్ టూర్ కు ముందే సంచలన నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ ఇవ్వనుంది.
ఇదే సమయంలో వన్డే తో పాటు టెస్ట్ జట్టుకు నాయకుడిగా రోహిత్ శర్మకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
Also Read : పాకిస్తాన్ బాధితుల కోసం బెన్ స్టోక్స్ విరాళం