BCCI MS Dhoni : జార్ఖండ్ డైన‌మెట్ కు బీసీసీఐ ఝ‌ల‌క్

మెంటార్ గా ఉండేందుకు నో చాన్స్

BCCI MS Dhoni : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యానికి ప్ర‌స్తుతం జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(BCCI MS Dhoni) స్కిప్ప‌ర్ గా ఉన్నాడు.

గ‌త ఏడాది యూఏఈలో జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు మెంటార్ గా ఉన్నాడు. ఇదే స‌మ‌యంలో సీఎస్ఏ టి20 లీగ్ లో ధోనీని మెంటార్ గా నియ‌మించాల‌ని సీఎస్కే యాజ‌మాన్యం భావిస్తోంది.

దీనిని ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది బీసీసీఐ. ఒక ర‌కంగా షాక్ ఇచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఒవ‌ర్సీస్ ఫ్రాంచైజీ లీగ్ ల‌లో భార‌త క్రికెట‌ర్లు పాల్గొన‌డంపై త‌మ వైఖ‌రిని మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డంతో బీసీసీఐ సీఎస్కేకి చాన్స్ ను నిరాక‌రించింది.

ఇదిలా ఉండ‌గా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) లో నాలుగుసార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది చెన్నై. కాగా సూప‌ర్ కింగ్స్ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) టి20 లీగ్ లో త‌మ కొత్త ఫ్రాంచైజీకి మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీని మెంటార్ గా నియ‌మించాల‌ని డిసైడ్ అయ్యింది.

కాగా సీఎస్ఏ టి20 లీగ్ లోని మొత్తం ఆరు ఫ్రాంచైజీల‌ను ఐపీఎల్ జ‌ట్ల య‌జ‌మానులు కొనుగోలు చేశారు. అయితే ఈ లీగ్ లో భార‌త క్రికెట‌ర్లు పాల్గొన‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది.

తాము ప‌ర్మిష‌న్ ఇవ్వ‌బోమంటూ స్ప‌ష్టం చేసింది బీసీసీఐ. ఒక వేళ ఓవ‌ర్సీస్ ఫ్రాంచైజీ లీగ్ లో పాల్గొనాల‌ని అనుకుంటే బీసీసీఐ తో అన్ని సంబంధాల‌ను తెంచు కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. దీంతో ధోనీకి బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

Also Read : సౌర‌వ్ గంగూలీ వ‌ర్సెస్ ఇయాన్ మోర్గాన్

Leave A Reply

Your Email Id will not be published!