Tilak Varma : తిలక్ వర్మకు సెలెక్టర్లు మొండిచేయి
ఐపీఎల్ లో అద్భుతంగా రాణింపు
Tilak Varma : స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. ఊహించని రీతిలో గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తీక్ , రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న చహల్ కు చోటు దక్కింది.
ఇక అంతా ఆశించినట్టుగా తెలంగాణ తేజం తిలక్ వర్మకు మొండి చేయి చూపించారు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ కుర్రాడు అద్భుతంగా రాణించాడు.
ప్రధానంగా ఆ జట్టు స్కిప్పర్ , భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఏదో ఒకరోజు టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమన్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునీల్ మనోహర్ గవాస్కర్ అయితే తిలక్ వర్మ(Tilak Varma) ను ఆకాశానికి ఎత్తేశాడు.
అతడిని భారత జట్టుకు ఎంపిక చేస్తే బావుంటుందని సూచించాడు. కానీ సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది. ఇక తిలక్ వర్మ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఆ జట్టు తరపున ఏకంగా 397 పరుగులు చేశాడు.
ఒక రకంగా చెప్పాలంటే స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అయినా తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు..రాణించాడు. పరువు పోకుండా కాపాడాడు.
అంతా అనుకున్నట్టుగానే జమ్మూ కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున రాణించిన రాహుల్ త్రిపాఠిని తీసుకోలేదు. ఇక ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) అన్ క్యాప్ డ్ ప్లేయర్లలో టాప్ లో నిలిచాడు.
చరిత్ర సృష్టించాడు ఠాకూర్ తిలక్ వర్మ(Tilak Varma). కానీ పరిగణలోకి తీసుకోక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు మహమ్మద్ అజహరుద్దీన్.
Also Read : కశ్మీర్ ఎక్స్ ప్రెస్ కు భలే ఛాన్స్