Sanju Samson : సంజూ శాంసన్ పై బీసీసీఐ వివక్ష
సోషల్ మీడియాలో సెలెక్టర్లపై ఫైర్
Sanju Samson : కేరళ స్టార్ హిట్టర్ , రాజస్తాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్(Sanju Samson) పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కక్ష కట్టిందా అన్న అనుమానం నెలకొంది.
ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ -2022 కు సంబంధించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
గత కొంత కాలంగా పూర్తిగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లీకి చాన్స్ ఇచ్చారు. కానీ ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు, అభిమానులు, మాజీ క్రికెటర్లు నిప్పులు చెరిగారు.
అసలు బీసీసీఐ ఎవరి కోసం పని చేస్తోందంటూ మండి పడుతున్నారు. భారత జట్టులో పైరవీలకు ప్రాధాన్యత ఉంటుందని, ఆడే వాళ్లకు చాన్స్ ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం సంజూ శాంసన్(Sanju Samson) ను స్టాండ్ బై గా కూడా ప్రకటించక పోవడాన్ని తప్పు పట్టారు. అక్షర్ పటేల్ , శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ లను ఎంపిక చేయడాన్ని ప్రశ్నించారు.
విండీస్ తో ఇటీవల జరిగిన వన్డే సీరీస్ లో సంజూ శాంసన్ రాణించాడు. బ్యాటర్ గా, కీపర్ గా సత్తా చాటాడు. దినేష్ కార్తీ స్ట్రైక్ రేట్ 133 అయితే శాంసన్ స్ట్రేక్ రేటు 160 మరి ఎందుకు అతడిని పక్కన పెట్టారో సెలక్షన్ కమిటీకి తెలియాలని మండిపడ్డారు.
సంజూ శాంసన్ లాంటి ప్రతిభావంతమైన ఆటగాడికి భారత జట్టులో ఆడే అర్హత ఉండదని పేర్కొన్నారు. కనీసం స్టాండ్ బైకి కూడా పనికి రాడా అంటూ నిలదీశారు.
Also Read : షమీ తప్పక ఉండాల్సిన ప్లేయర్