Sanju Samson BCCI : శాంసన్ పై కక్ష బీసీసీఐ వివక్ష
బంగ్లాదేశ్ టూర్ కు నో ఛాన్స్
Sanju Samson BCCI : కేరళ స్టార్ హిట్టర్ , రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంజూ శాంసన్ ను(Sanju Samson BCCI) ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. అంతే కాదు ఏ క్రికెటర్ కు లేనంతటి క్రేజ్ ఇప్పుడు కేరళ స్టార్ కు దక్కింది.
సామాజిక మాధ్యమాల్లో టాప్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు సంజూ శాంసన్. అడపా దడపా ఎంపిక చేయడం ఆ తర్వాత ఆడించక పోవడం షరా మామూలుగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ టూర్ లో ఉన్నా మూడు టి20 సీరీస్ లో ఎంపిక చేయలేదు. తాత్కాలిక కోచ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ , కెప్టెన్ హార్దిక్ పాండ్యా కావాలని తప్పించారన్న విమర్శలు ఉన్నాయి.
ఇదే సమయంలో శిఖర్ ధావన్ సారథ్యంలోని వన్డే సీరీస్ లో కూడా సంజూ శాంసన్ కు ఛాన్స్ ఉండక పోవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు సంజూ శాంసన్ ఫ్యాన్స్ , మాజీ క్రికెటర్లు సైతం ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ మండి పడుతున్నారు.
కనీసం 10 మ్యాచ్ లు ఆడించాలని అప్పటి వరకు వేచి చూడాలని , ఆడక పోతే ఎంపిక చేయొద్దంటూ మాజీ క్రికెటర్ , మాజీ భారత జట్టు హెడ్ కోచ్ , కామెంటేటర్ రవి శాస్త్రి సూచించాడు.
మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్ సైతం సంజను ఎంపిక చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీసీసీఐ సంజూ శాంసన్ పట్ల శీతకన్ను వేసింది. మొత్తంగా పాలిటిక్స్ ప్రభావం చూపిస్తున్నాయని జట్టు ఎంపికలో విమర్శలున్నాయి.
Also Read : ఐపీఎల్ మినీ వేలం తేదీ మార్పుపై బీసీసీఐ ఫోకస్