BCCI IPL : ఐపీఎల్ మినీ వేలం తేదీ మార్పుపై బీసీసీఐ ఫోకస్
మళ్లీ షెడ్యూల్ చేయాలని కోరిన ఫ్రాంచైజీలు
BCCI IPL : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వచ్చే ఏడాది 2023లో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కొనసాగనుంది. ఇప్పటికే రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను 10 జట్లకు సంబంధించి ఫ్రాంచైజీలు ఇప్పటికే బీసీసీఐకి(BCCI IPL) సమర్పించాయి. కాగా ఇప్పటికే బీసీసీఐ మినీ వేలం పాట నిర్వహించేందుకు తేదీని ఖరారు చేసింది.
కేరళ లోని కొచ్చిలో డిసెంబర్ 23న మినీ వేలం పాటను చేపట్టాలని నిర్ణయించింది కూడా. దీంతో వేలం పాట నిర్వహించే తేదీని సవరించాలని ఆయా జట్లకు సంబంధించిన యాజమాన్యాలు బీసీసీఐని విన్నవించాయి. దీనిపై పునరాలోచనలో పడింది బీసీసీఐ.
ఇందులో పాల్గొనే వారు డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల లోపు వేలం కోసం నమోదు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 23 క్రిస్మస్ పండుగ దగ్గర ఉన్నందున వేలం తేదీని ముందుకు లేదా వెనకకు మార్చాలని ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి.
అయితే ఈ తేదీ ఖరారుకు సంబంధించి వచ్చే వారం బీసీసీఐ అధికారికంగా కీలక ప్రకటన చేయనుందని సమాచారం. ఫెస్టివల్ రానుండడంతో ఆయా జట్లలో కీలకమైన ఆటగాళ్లు చాలా మంది అందుబాటులో ఉండక పోవచ్చని ఆందోళన చెందుతున్నాయి.
అన్ని ఫ్రాంచైజీలలో విదేశీ కోచింగ్ సిబ్బంది ఉన్నారు. ప్రధాన కోచ్ లు లేకుండా టోర్నీలో జట్లు ఆడడం కష్టమే. దీంతో బీసీసీఐ తేదీ మార్చేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతోంది.
తమ జట్ల నుండి 85 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. 163 మంది ప్లేయర్లను తమ వద్ద ఉంచుకున్నాయి. ఐపీఎల్ వేలం పాట మొత్తంగా తేదీ మారనుంది.
Also Read : బీసీసీఐ నిర్వాకం పంత్ కు అందలం