BCCI KL Rahul : కేఎల్ రాహుల్ కు బీసీసీఐ అండ
వెనకేసుకు వస్తున్న రోహిత్ , ద్రవిడ్
BCCI KL Rahul : కేఎల్ రాహుల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ లో లక్నో జెయింట్స్ కు స్కిప్పర్ గా ఉన్నాడు. కానీ గత కొంత కాలంగా విఫలం అవుతూ వస్తున్నాడు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఓ వైపు లెక్కలేనంత మంది ఆటగాళ్లు రాణిస్తున్నా కావాలని కేఎల్ రాహుల్ ను కంటిన్యూగా ఎంపిక చేస్తూ వస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).
అంతే కాదు ఇటీవల సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తన వద్దకు చాలా మంది ఆటగాళ్లు వస్తారని , కానీ సంజూ శాంసన్ విషయంలో తన అక్కసునంతా వెళ్లగక్కాడు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు బీసీసీఐలో పాలిటిక్స్ ఎక్కువ. ప్రస్తుతం దిగ్గజ వ్యాపార సంస్థలు టేకోవర్ చేసుకున్నాయి జట్లను. ఇదే సమయంలో తుది జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో ఆయా సంస్థల అధిపతులు ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు లేక పోలేదు.
ఇందుకు కేఎల్ రాహుల్ మినహాయింపు ఏమీ కాదని మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అంతే కాదు విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ను (BCCI KL Rahul) ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. విచిత్రం ఏమిటంటే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కేఎల్ రాహుల్ ను వెనకేసుకు రావడం విస్తు పోయేలా చేసింది. ప్రతిభ లేక పోయినా సపోర్ట్ చేయడంపై ఫ్యాన్స్ తెగ మండి పడుతున్నారు.
Also Read : శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా