IPL 2022 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు

25 శాతం మంది ప్రేక్ష‌కుల‌కు ఛాన్స్

IPL 2022 : ముంబై వేదిక‌గా ఈనెల‌26న ఐపీఎల్ 15వ సీజ‌న్ 2022 (IPL 2022 )ప్రారంభం కానుంది. క‌రోనా వేవ్ కార‌ణంగా ఈసారి ఇత‌ర చోట్ల మ్యాచ్ లు నిర్వ‌హించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 14 సీజ‌న్ల‌లో 8 జ‌ట్లు పాల్గొన్నాయి.

ఈసారి రెండు కొత్త జ‌ట్లు చేర‌డంతో మొత్తం 10 జ‌ట్లతో రిచ్ లీగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యాన్స్ కు చాన్స్ లేద‌ని తేల్చి చెప్పిన బీసీసీఐ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది.

100 శాతం కాకుండా 25 శాతం మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఐపీఎల్ నిర్వ‌హ‌ణ క‌మిటీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని 15వ ఐపీఎల్ సీజ‌న్ ను ముంబై, పూణే వేదిక‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు.

ఈనె 26 నుంచి ప్రారంభ‌మై మేలో పూర్తి అవుతుంది. ఇదిలా ఉండ‌గా ఈనెల 26న ప్రారంభ మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో దుబాయి వేదిక‌గా జ‌రిగిన 14వ సీజ‌న్ టోర్నీలో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన కేకేఆర్ ఆడ‌నుంది.

పెద్ద ఎత్తున క్రికెట‌ర్ల‌ను చూడాల‌ని కోరిక‌తో ఉన్న అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది బీసీసీఐ. చివ‌ర‌కు ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువ కావ‌డంతో త‌ట్టుకోలేక బీసీసీఐ దిగి వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా 2021లో రెండు సెష‌న్లుగా నిర్వహించింది బీసీసీఐ.

ప్ర‌పంచం లోనే అత్యంత ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా బీసీసీఐ పేరొందింది. వ‌చ్చే ఏడాది రూ. 50 వేల కోట్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా.

కాగా స్టేడియంలోకి వ‌చ్చే ప్రేక్ష‌కులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది బీసీసీఐ.

Also Read : వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఝుల‌న్ సంచ‌ల‌నం

Leave A Reply

Your Email Id will not be published!