Kapil Dev : కపిల్ దేవ్ ను అవమానించిన బీసీసీఐ
ఫైనల్ కు ఆహ్వానించ లేదన్న మాజీ కెప్టెన్
Kapil Dev : అహ్మదాబాద్ – భారత క్రికెట్ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన క్రికెటర్ , టీమిండియా మాజీ కెప్టెన్ , తొలిసారిగా 1983లో ప్రపంచ కప్ ను తీసుకు వచ్చిన రథ సారథి హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ కు ఘోరమైన అవమానం జరిగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ఆరవ సారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇది ఓ రికార్డ్ .
Kapil Dev Comments Viral
అయితే ఇండియాలో వరల్డ్ కప్ వచ్చాక క్రికెట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. కపిల్ దేవ్(Kapil Dev) తర్వాత, సునీల్ గవాస్కర్ , మహమ్మద్ అజాహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్లు ప్రాతినిధ్యం వహించారు. కేవలం సచిన్ టెండూల్కర్ ను మాత్రమే వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది బీసీసీఐ.
విచిత్రం ఏమిటంటే ఎలాంటి రాజకీయాలు తెలియని , దేశం కోసం సర్వ శక్తులు ధార పోసి దేశపు జెండాను ప్రపంచ వ్యాప్తంగా రెప రెప లాడేలా చేసిన అరుదైన ఆటగాడు కపిల్ దేవ్. ఆయనే స్వయంగా తనను వరల్డ్ కప్ ఫైనల్ కు ఆహ్వానించ లేదంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీసీసీఐ ఫక్తు జే షా జేబు సంస్థగా మారి పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ మధ్యన రెజ్లర్లు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా నిలిచాడు కపిల్ దేవ్.
Also Read : Australia Win : ఆరవసారి ఆసిస్ విశ్వ విజేత