BCCI Politics : బీసీసీఐ నిర్వాకం పంత్ కు అందలం
బిన్నీ..జేషా నిద్ర పోతున్నారా
BCCI Politics : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆఫీసుగా మారి పోయిందన్న ఆరోపణలు(BCCI Politics) ఉన్నాయి. ఒక్క బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తప్పా ఏ ఒక్కరు మైదానంలో క్రికెట్ ఆడిన వాళ్లు కారు. ఇది పక్కన పెడితే అత్యంత అధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరొందింది బీసీసీఐ.
ఇక ప్రధానంగా చెప్పు కోవాల్సింది జే షా గురించి. బిన్నీ చీఫ్ గా ఉన్నా పవర్ మొత్తం కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా చేతిలోనే ఉంది. ఇక ఆయన ఏం చెబితే అదే వేదం. గతంలో గంగూలీ ఉండేవాడు. దాదా ఎవరినీ కేర్ చేయక పోవడంతో పొమ్మనకుండా పొగ పెట్టారు.
ఇదిలా ఉండగా చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది బీసీసీఐ. ఎవరైనా గ్రౌండ్ లో అద్భుతంగా ఆడిన క్రికెటర్లను పరిగణలోకి తీసుకుంటారు. కానీ ప్రతిభ కనబర్చని క్రికెటర్లను ఎంపిక చేసి దేశ పరువు పోయేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా దేశీయంగా , అంతర్జాతీయ పరంగా, ఐపీఎల్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson). మరో వైపు దేశీయ టూర్ లో ఆడిన సంజూ శాంసన్ ను కాదని ఎలాంటి ప్రతిభ కనబర్చని రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు.
ఆసియా కప్ , వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ టూర్ కు కూడా ఎంపిక చేయడం నిరాశ పర్చడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎందుకంత బీసీసీఐకి ప్రేమనో అర్థం కావడం లేదని శాంసన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
Also Read : వన్డే లోనైనా శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా