BCCI SAHA : భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వృద్ది మాన్ సాహా ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశాడు. తనను టీమిండియా టెస్టు కు ఎంపిక చేయలేదు భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ. దీనిపై అసహనం వ్యక్తం చేశాడు.
పనిలో పనిగా బీసీసీఐ(BCCI SAHA) చీఫ్ సౌరవ్ గంగూలీ తనతో చాట్ చేసిన దానిని ప్రస్తావించాడు. బాగా ఆడుతున్నావని, జట్టులో కంపల్సరీగా చోటు లభిస్తుందని హామీ ఇచ్చాడంటూ తెలిపాడు.
ఇదే సమయంలో భారత క్రికెట్ హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. తనను పదవీ విరమణ చేయాలని సూచించాడంటూ పేర్కొన్నాడు.
అంతే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలకు తెర తీశాడు. అదేమిటంటే ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ తనను ఇంటర్వ్యూ కోసం బెదిరింపులకు గురి చేశాడంటూ ఆరోపించాడు.
ఇందుకు సంబంధించి పేరు చెప్పకుండానే తనతో వాట్సాప్ ద్వారా చేసిన మెస్సేజ్ లను షేర్ చేశాడు. సాహా (BCCI SAHA)చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగింది బీసీసీఐ.
ఈనెల 23న అపెక్స్ కౌన్సిల్ భేటీలో సహా, జర్నలిస్ట్ ఎపిసోడ్ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ నివేదికపై సమీక్ష జరపనుంది. ఇందుకు సంబంధించి విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది బీసీసీఐ.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ , అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభ్ తేజ్ భాటియా కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ పూర్తి నివేదికను సమర్పించనుంది.
Also Read : ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిక్లేర్