Sanju Samson Back Up : సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయరా
బీసీసీఐ నిర్వాకంపై ఫైర్
Sanju Samson Back Up : బీసీసీఐ కొందరి పట్ల ఎంత కచ్చితంగా ఉంటుందో కేరళ స్టార్ సంజూ శాంసన్ ను చూస్తే తెలుస్తుంది. ముంబైకి చెందిన సూర్య కుమార్ యాదవ్ ఆ మధ్యన వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చినా కంటిన్యూ చేసింది. దీనికి ద్రవిడ్ చెప్పిన మాటలు విస్తు పోయేలా చేశాయి. ఇక ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియని పరిస్థితిని కల్పించింది బీసీసీఐ(BCCI) సంజూ శాంసన్ కు. దీంతో ఆట మీద ఫోకస్ పెట్టలేక పోయాడు. ఇటీవల విండీస్ టూర్ లో నిరాశ పరిచాడు. ఇక వికెట్ కీపింగ్ విషయంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ముంబై లాబీయింగ్ ఇప్పుడు డామినేట్ చేస్తోందన్న ఆరోపణలు లేక పోలేదు.
Sanju Samson Back Up Player
ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా బీసీసీఐ సెక్రటరీ జే షా, ముంబై లాబీ ఎక్కువగా భారత జట్టు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇదిలా పక్కన పెడితే మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చాలా సార్లు సంజూ శాంసన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ఏ ఆటగాడికైనా కనీసం 10 మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వాలని సూచించాడు. కానీ ఒకటి రెండు మ్యాచ్ లు ఛాన్స్ ఇచ్చి ఆడదలేదంటూ పక్కన పెట్టడం దారుణం.
తాజాగా వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ 2023కి బీసీసీఐ టీమిండియాను సెలెక్ట్ చేసింది. సంజూ శాంసన్ ను బ్యాకప్ ప్లేయర్ గా ఎంపిక చేసింది. దీనిపై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
Also Read : Asia Cup 2023 India Squad : ఆసియా కప్ భారత జట్టు డిక్లేర్
