BCCI ICC : ఐసీసీలో పెరగనున్న బీసీసీఐ వాటా
మీడియా హక్కుల ద్వారా రూ. 10,000 కోట్లు
BCCI ICC Media Rights : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో బీసీసీఐ వాటా పెరగనుంది. బీసీసీకి(BCCI ICC Media Rights) సంబంధించిన ఐసీసీ మీడియా హక్కుల షేరు రూ. 10,000 కోట్లు దాటనుంది. ఐసీసీలో ఆర్థిక పలుకుబడిని పొందనుంది. మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి భారీ ఎత్తున ఆదాయం సమకూరనుంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా గుర్తింపు పొంది.
ఇటీవల విమెన్స్ ఐపీఎల్ వేలం పాటలో మీడియా హక్కులకు సంబంధించి భారీ ఎత్తున అనుకోని రీతిలో డబ్బులు సమకూరాయి. ఇక 2024-27 కు సంబంధించి ఐసీసీ ఖజానాకు బీసీసీఐ తో పాటు ఇతర క్రీడా సంస్థలు అందించే మార్కెట్ వాటాలో అంతరం విపరీతంగా పెరగనుంది.
గత ఆగస్టులో ఖరారు చేసిన నాలుగు ఏళ్ల ఒప్పందం కోసం భారత దేశ ప్రసారకర్తలు $3 బిలియన్లను వెచ్చించాయి. మిగిలిన కీలక ప్రాంతాలు సుమారు $500 మిలియన్లతో మాత్రమే చేరాయని అంచనా.
పాలక మండలి తన ఆదాయ వాటాలో దామాషా పెరుగుదల కోసం బీసీసీఐ ఇప్పటికే ఒక ఎత్తుగడ వేసింది. గత నెల జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశంలో తుది విలువలో 37 శాతం గురించి చర్చించారు. బీసీసీఐ(BCCI) ప్రస్తుతం పొందుతున్న 22 శాతం అంటే 405 మిలియన్లు , ఎనిమిదేళ్లు. దీని కంటే గణనీయంగా $1.3 బిలియన్లు సుమారు రూ. 10,000 కోట్లు రేంజ్ లో ఏదైనా పొందనుంది.
బీసీసీఐకి అనుకున్నట్లుగా పనులు జరిగితే దాని ప్రస్తుత ఆఫీస్ బేరర్లకు గనణీయమైన విజయంగా పరిగణించ బడుతుంది. ఇప్పటికే బోర్డు కార్యదర్శి జే షా ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి కూడా నేతృత్వం వహిస్తారు. ఇక ప్రారంభ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంతో ఉమెన్ ప్రిమీయర్ లీగ్ ను భారత్ లో ఇతర దేశాలలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
Also Read : పంజాబ్ రాణించేనా లక్నో గెలిచేనా